Virat Kohli Special Century.. నీకో దండం.. ఇక ఆపెయ్.! చెత్త బ్యాటింగ్, రిటైర్మెంట్ తీస్కో.! చేవ లేనప్పుడు, క్రికెట్ మైదానంలో ఎందుకు.?
ఇవన్నీ కింగ్ విరాట్ కోహ్లీ గురించి, చాలా సందర్భాల్లో చాలామంది క్రికెట్ ‘ఉచ్చలేషకులు’ చేసిన కామెంట్లే.! సాధారణ క్రికెట్ అభిమానులో, మీడియానో కామెంట్ చేస్తే, అదో లెక్క.!
క్రికెట్ గురించి తెలిసీ, క్రికెట్లో సుదీర్ఘ అనుభవం వున్న.. క్రికెట్ విశ్లేషకులే, క్రికెటర్ల గురించి అత్యంత జుగుప్సాకరమైన కామెంట్లు చేస్తుంటారు.
ఇవేవీ క్రికెటర్లు సాధారణంగా పట్టించుకోరు.. కేవలం, ఆట మీదనే ఫోకస్ పెడతారు.! బ్యాటుతోనో, బాల్తోనో సమాధానాలు చెబుతుంటారు.
Virat Kohli Special Century.. విరాట్ కోహ్లీ సెంచరీ.. సరైన సమయంలో సరైన సమాధానం.!
క్రికెట్ నుంచి పూర్తిగా కోహ్లీ రిటైర్మెంట్ తీసుకోవడం మంచిదంటూ బోడి సలహాలు ఈ మధ్య క్రికెట్ విశ్లేషకుల నుంచి వింటున్నాం.!
ఏదీ, ఇప్పుడు అవే విశ్లేషణలు చెయ్యమనండి చూద్దాం.? ఛాన్సే లేదు.! ఎందుకంటే, విరాట్ కోహ్లీ మైదానంలో పాతికేళ్ళ కుర్రాడిలా కదిలాడు.!
బ్యాటింగ్, ఫీల్డింగ్ అదరగొట్టేశాడు. బంతిని, బౌండరీ అవతలకు తరలించడంలో అయినా, వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తడంలో అయినా, కోహ్లీ తర్వాతే ఎవరైనా.. అని ఇంకోసారి నిరూపించాడు.
సెంచరీలు విరాట్ కోహ్లీకి కొత్త కాదు.! బోల్డన్ని కొట్టేశాడు, ముందు ముందు కొడతాడు కూడా.! కానీ, నిన్నటి సెంచరీ చాలా చాలా ప్రత్యేకం.!
నిజానికి, కోహ్లీ ఎప్పుడు సెంచరీ చేసినా, అది చాలా చాలా ప్రత్యేకంగానే వుంటుందనుకోండి.. అది వేరే సంగతి.!
ఏది ఏమైనా కింగ్ ఈజ్ బ్యాక్.! ఎన్నాళ్ళు క్రికెట్‌ని ఆస్వాదిస్తాడో, అన్నేళ్ళు క్రికెట్లో కొనసాగగలుగుతాడు విరాట్ కోహ్లీ.!
రిటైర్మెంట్ అనేది విరాట్ కోహ్లీ సొంత నిర్ణయం. అది ఆయన ఎప్పుడైనా తీసుకోవచ్చు.! అన్నట్లు, టెస్టుల్లోకి కూడా విరాట్ కోహ్లీ రీ-ఎంట్రీ ఇస్తే బావుణ్ణన్నది అభిమానుల కోరిక.!
అన్నట్లు, నిన్నటి మ్యాచ్‌లో మరో సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ కూడా చెలరేగిపోయాడు. అర్థ సెంచరీ బాదాడు.! గతంతో పోల్చితే, చాలా ఫిట్‌గా వున్నాడు.!
