Virat Kohli The King.. ఎలాగైతేనేం, విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టేశాడు.. అదీ దాదాపు వెయ్యి రోజుల తర్వాత.!
ఒకప్పుడు విరాట్ కోహ్లీ (King Kohli) సెంచరీ కొడితే, అది చాలా చిన్న విషయం.! ఎందుకంటే, తరచూ సెంచరీలు బాదేవాడు గనుక.
కానీ, ఇప్పుడు పరిస్థితి అది కాదు. దాదాపు మూడేళ్ళ తర్వాత విరాట్ కోహ్లీ (Virat Kohli) బ్యాట్ నుంచి సెంచరీ జాలువారింది.
ఎప్పుడో 2019 నవంబర్‌లో విరాట్ కోహ్లీ బంగ్లా దేశ్ మీద సెంచరీ బాదాడు, అదీ టెస్టులో. మళ్ళీ ఇప్పుడు.. దాదాపు వెయ్యి రోజుల తర్వాత ఆఫ్గనిస్తాన్ మీద సెంచరీ కొట్టాడు.. అదీ టీ20 మ్యాచ్‌లో.
Virat Kohli The King.. క్రికెట్‌లో విరాట్ పర్వం.!
భారత క్రికెట్ గురించి మాట్లాడాల్సి వస్తే, చాలామంది లెజెండ్స్ గురించి ప్రస్తావించుకోవాలి. కొన్నాళ్ళ తర్వాత విరాట్ కోహ్లీ పేరు కూడా ఆ లెజెండ్స్ లిస్టులోకే చేరుతుంది.

లక్ష్య ఛేదనలో టీమిండియాకి తిరుగులేని ధైర్యాన్నిచ్చాడు విరాట్ కోహ్లీ. ఔను, ప్రత్యర్థి జట్టు ఎంత పెద్ద స్కోరుని టార్గెట్‌గా పెడితే, అంత కసిగా విరాట్ కోహ్లీ చెలరేగిపోతాడు.
జట్టు కెప్టెన్‌గా కూడా కోహ్లీ ఎన్నో విజయాల్ని టీమిండియాకి అందించాడు. అలాంటి కోహ్లీ, బ్యాడ్ ఫేజ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏ క్రికెటర్‌కి అయినా, ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి సర్వసాధారణం.
తీసెయ్యాలనుకున్నారుగానీ..
విరాట్ కోహ్లీది దూకుడు మనస్తత్వం. ఈ కారణంగా కొన్ని పొరపాట్లు చేసి వుండొచ్చు. కొంత అత్యుత్సాహమూ ప్రదర్శించి వుండొచ్చు.
Also Read: పవన్ అభిమానుల మాల ధారణ.! వాళ్ళకి బాగా కాలినట్టుందే.!
కానీ, ఇండియన్ క్రికెట్‌కి విరాట్ కోహ్లీ అందిస్తున్న సేవల గురించి తక్కువగా మాట్లాడలేం. అన్ని ఫార్మాట్లలోనూ కోహ్లీ సాధించిన సెంచరీల సంఖ్య 71. ఇది చిన్న విషయమేమీ కాదు.
కింగ్ కోహ్లీ.! ఔను, ఎప్పడూ విరాట్ కోహ్లీ (Virat Kohli) కింగ్ లాంటోడే.! కాకపోతే, ఒక్కోసారి టైమ్ బ్యాడ్ అవుతుందంతే.!