Table of Contents
Virupaksha Review.. హరర్ కామెడీ సినిమాలు ఒకానొక టైమ్‌లో బాగా వర్కవుట్ అయ్యాయి.! కేవలం హరర్ మాత్రమే అంటే.. అది రిస్కీ వ్యవహారమే మరి.!
ఇంతకీ, రిస్కీ అటెంప్ట్ సాయి ధరమ్ తేజ్ ఎందుకు చేసినట్లు.? రిస్క్ చేసినందుకు ఫలితం పాజిటివ్ అవుతుందా.? నెగెటివ్ అవుతుందా.?
బహుశా అలాంటి లెక్కలేవీ వేసుకోకుండా, కథని నమ్మి ‘విరూపాక్ష’ (Virupaksha Movie) సినిమా చేశారనుకోవాలేమో.!
స్క్రీన్-ప్లే, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ (బ్యాక్‌గ్రౌండ్ స్కోర్), ఎడిటింగ్.. ఇవన్నీ పెర్‌ఫెక్ట్‌గా సెట్టయితే.. ఏ సినిమాకైనా అంతకన్నా కావాల్సింది ఇంకేముంటుంది.?
Virupaksha Review.. సాయి ధరమ్ తేజ్ ఎలా వున్నాడు.?
సాయి ధరమ్ తేజ్‌కి మాట పూర్తిగా పడిపోయిందట.. బిత్తర చూపులు చూస్తున్నాడట.. అంటూ ప్రచారం జరుగుతున్న రోజుల్లోనే ‘విరూపాక్ష’ సినిమా షూటింగ్‌కి హాజరయ్యాడతడు.
Also Read: ‘శాకుంతలం’ డిజాస్టర్: సమంత ‘కర్మ’ సిద్ధాంతం.!
సినిమా చూస్తే, తెరపై చాలా కాన్పిడెంట్‌గా కనిపించాడు. అంతకు ముందు ‘రిపబ్లిక్’ సినిమాలో కూడా (యాక్సిడెంట్‌కి ముందు చేసిన సినిమా) సీరియస్ రోల్‌లోనే కనిపించాడు.
కానీ, ‘విరూపాక్ష’ (Virupaksha) చాలా భిన్నమైనది. హీరోయిజం ఒకట్రెండు సన్నివేశాల్లోనే కనిపిస్తుంది. ఎందుకంటే, పాత్రలన్నీ కథానుగుణంగానే నడిచాయ్.. ఎవరూ ‘బోర్డర్ దాటి’ అతి చెయ్యలేదు.
ముందే చెప్పుకున్నాం కదా, స్క్రిప్ట్ (Virupaksha Movie) బాగా కుదిరింది. దానికి మిగతావన్నీ అదనపు ఆకర్షణలుగా నిలిచాయి.
సౌండ్ మిక్సింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. సినిమాలోకి.. కాదు కాదు, రుద్రవరం అనే గ్రామంలోకి మనల్ని తీసుకుపోయారు.

ఎక్కువ భాగం రాత్రి పూటే షూట్ చేశారు.. సినిమాటోగ్రఫీ పరంగా డిటెయిలింగ్‌కి ఫుల్ మార్క్స్ వేసుకోవచ్చు. అంత బాగా డిజైన్ చేశారు.
ఎంత చెయ్యాలో.. అంతే చేశారు..
నటీనటుల విషయానికొస్తే, సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) తన పాత్రకి ఎంత చేయాలో అంతే చేశాడు. సంయుక్త మీనన్ సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్. ఆమె మంచి నటి, ఆ విషయం ఇంకోసారి ప్రూవ్ అయ్యింది.
బిగ్‌బాస్ ఫేం రవికృష్ణ తన పాత్రలో ఒదిగిపోయాడు. సోనియా సింగ్ క్యూట్‌గా అనిపిస్తుంది. బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల.. తమ అనుభవాన్ని రంగరించారు.
సునీల్ కూడా ఒకింత సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ అనుకోవాలేమో.! యాంకర్ శ్యామల ఓకే. మిగతా పాత్రధారులంతా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
కథ గురించి మాట్లాడుకోవాలంటే… ఓ ఊరు.. అందులో అనుమానాస్పద మరణాలు.. ఊరి ప్రజల నమ్మకాలు.. ఆ మరణాల మిస్టరీని ఛేదించే యువకుడు.. ఇదే.. ఇంతకు మించి మాట్లాడుకోకూడదేమో.!
చిత్ర నిర్మాతలు కూడా అదే చెబుతున్నారు. సినిమా చూసినోళ్ళెవరూ, ట్విస్టుల్ని రివీల్ చేయొద్దన్నది ఓ విజ్ఞప్తి. కానీ, సినిమా బయటకు వచ్చాక.. ఆగుతుందా.?
ట్విస్టులు తెలుసుకుని సినిమాకెళ్ళొద్దు..
ట్విస్టులు తెలుసుకుని సినిమాకి వెళితే థ్రిల్ మిస్ అవుతాం. అదొక్కటీ ఖచ్చితంగా చెప్పగలం.!
చివరగా.. సాధారణంగా హర్రర్ సినిమాలంటే దూరంగా వుండే నేను.. కేవలం సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కోసమే (యాక్సిడెంట్ తర్వాత అతనెలా స్క్రీన్ మీద కనిపిస్తాడోనని) ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాను.
భయపడేంతలా కొన్ని సన్నివేశాలున్నా.. కేవలం థ్రిల్‌కి మాత్రమే గురయ్యాను. బహుశా, సినిమాని అంతలా ఎంజాయ్ చేశానేమో.!
సాయి ధరమ్ తేజ్ ఈజ్ బ్యాక్.! తదుపరి సినిమాకి డబుల్ ఎనర్జీతో.. కాదు కాదు, అంతకు మించిన ఎనర్జీతో కంప్లీట్ కమర్షియల్ హీరోని సాయి ధరమ్ తేజ్‌లో చూడగలం.!