క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli), బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ (Anushka Sharma) దంపతుల (Virat Kohli Anushka Sharma Virushka) ఇంట ఓ చిన్నారి సందడి చేయనుంది.. అతి త్వరలో. ఆ చిన్నారి రాక 2021 జనవరిలో.. అంటూ ‘విరుష్క’ (Virushka) జోడీ తాజాగా సోషల్ మీడియాలో వెల్లడించారు.
తన భార్య అనుష్క ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో.. ఇటు విరాట్ కోహ్లీ అభిమానులు.. అటు అనుష్క శర్మ అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. విరాట్, అనుష్క.. కొంత కాలం ప్రేమించుకుని.. ఒకర్ని ఒకరు అర్థం చేసుకున్నాక.. వైవాహిక బంధంతో ఒక్కటయిన విషయం విదితమే.
విరాట్ తన క్రికెట్ కెరీర్‌తో బిజీగా వుంటే, అనుష్క శర్మ పెళ్ళయ్యాక కూడా వరుస సినిమాలు చేస్తూ వచ్చింది. ఇక, కరోనా సీజన్లో ఈ జంట సోషల్ మీడియా వేదికగా చేసిన సందడి అంతా ఇంతా కాదు. విరాట్‌ని క్రికెట్ గ్రౌండ్లో చూడలేకపోతున్నాం.. అనుష్కని వెండితెరపై చూడలేకపోతున్నాం.. అన్న భావన అభిమానులకు కలగకుండా, వీలైనంతగా తమ అభిమానుల్ని ‘విరుష్క’ జోడీ కరోనా సీజన్లో మేగ్జిమవ్ు ఎంటర్టైన్ చేసింది.
ఇప్పుడీ ‘శుభవార్త’ చెప్పడంతో.. అభిమానుల సంబరాలకు ఆకాశమే హద్దుగా మారింది. ఓ బుల్లి విరాట్ రాబోతున్నాడని.. విరాట్ అభిమానులు అంటోంటే, కాదు కాదు.. ఓ బుల్లి అనుష్క రాబోతోందని అనుష్క శర్మ అభిమానులు అప్పుడే జోస్యం చెప్పడం షురూ చేసేశారు.
ఇక, విరాట్ కోహ్లీ.. మైదానంలో అడుగుపెట్టడానికి సిద్ధంగా వున్నాడు.. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ కోసం ఇప్పటికే కసరత్తులు పూర్తి చేశాడు విరాట్.
ప్రొఫెషనల్ లైఫ్‌ని పక్కన పెడితే, విరాట్.. అనుష్క.. (Virat Kohli Anushka Sharma Virushka) తమకు తోచిన స్థాయిలో కరోనా లాక్డౌన్ సందర్భంగా పేదల్ని ఆదుకునేందుకు ప్రయత్నించారు. పబ్లిసిటీకి దూరంగా ఈ ‘విరుష్క’ జంట చాలా సేవా కార్యక్రమాల్ని కరోనా సీజన్లో నిర్వహించింది.