Home » సినీ మాయ: ఆమె గుండు గీసుకుంటది! ఈమె గడ్డం తీసేసుకుంటది!

సినీ మాయ: ఆమె గుండు గీసుకుంటది! ఈమె గడ్డం తీసేసుకుంటది!

by hellomudra
0 comments
Vishnupriya Swetha Lakshman

Vishnupriya Swetha Lakshman Sahaa.. ‘ఛాలెంజ్ చేస్తున్నా.. నా సినిమా మీకు నచ్చకపోతే, నడి రోడ్డు మీద గుండు గీయించుకుంటా..’ అంటోంది ఓ నటి.!

‘ఆ నటి గుండు గీయించుకుంటుందట.. నువ్వేం చేస్తావ్.?’ అని ప్రశ్నిస్తే, ‘నేను గడ్డం తీసేస్తా..’ అని చెప్పింది ఇంకో నటి.!

మొన్నీమధ్యనే ఓ దర్శకుడు, తన సినిమా ఫెయిలయితే గుండు గీయించుకుంటానన్నాడు.. మరో నటుడు చెంపలు పగలగొట్టుకున్నాడు.

ఇంకో ఫిలిం మేకర్, లైవ్‌లో చెప్పుతో కొట్టుకున్నాడు.! ఏవేవో జరుగుతున్నాయి తెలుగు సినీ పరిశ్రమలో గత కొంతకాలంగా.

సినిమా ప్రమోషన్ అంటేనే, వెగటు పుట్టించేస్తోంది. మీడియా ముసుగులో సినీ ఎర్నలిస్టులు సంధించే పనికిమాలిన ప్రశ్నలు, సినీ ప్రముఖులు చెప్పే పనికిమాలిన సమాధానాల సంగతి సరే సరి.

కొత్తగా, ఈ గుండు గీయించుకోవడమేంటి.? చెంపలు పగలగొట్టుకోవడమేంటి.? నటి గడ్డం గీసుకుంటాననడం ఏంటి.? ముందు ముందు ఇంకెలాంటి పైత్యాలు చూడాలో ఏమో.!

గుండు గీయించుకుంటానని ఛాలెంజ్ చేసిన నటి పేరు శ్వేత లక్ష్మణ్. సినిమా పేరేమో ‘సహ’.

అయితే, అదే వేదిక మీద, ‘అలాంటి ఛాలెంజ్‌లు చెయ్యొద్దు’ అని నిర్మాత బన్నీ వాస్ ఆ నటికి క్లాస్ పీకాడనుకోండి.. అది వేరే సంగతి.

ఇక, శ్వేత లక్ష్మణ్ చేసిన ‘గుండు’ కామెంట్ పట్టుకుని, ఇంకో నటి విష్ణుప్రియని ఓ సినీ ఎర్నలిస్ట్ ప్రశ్నిస్తే, ‘గడ్డం తీసేస్తా’ అని సెలవిచ్చిందామె.

మహిళ కదా విష్ణుప్రియ.. ఆమెకి గడ్డం వుండటమేంటి.? అంటే, జస్ట్ ఆమె కామెడీ చేసిందంతే.. అని సరిపెట్టుకోవాలి.!

సినిమా పబ్లిసిటీ కోసం బహుశా ఎవరైనా బయట నుంచి ఇలాంటి దిక్కుమాలని ఐడియాలు ఇస్తున్నారేమో.! మీరు ఇలా అడగండీ.. మీరు ఇలా సమాధానం చెప్పండీ.. అని ప్రిపేర్ అవుతున్నారేమో ఇరు పక్షాలూ.

చెప్పుతో కొట్టుకోవడం కూడా పబ్లిసిటీ స్టంటేనా.? అంతేనేమో.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group