యూ ట్యూబ్.. ఇంటర్నెట్‌లో ఓ సంచలనం. చిన్న చిన్న విషయాల్నీ, ముఖ్యమైన విషయాల్నీ.. వీడియోల రూపంలో ఇంటర్నెట్‌లోకి ఎక్కించేయాలంటే, దానికి సరైన వేదిక యూ ట్యూబ్ (Vishwaksen Warning To Youtuber) అని అందరికీ తెలుసు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్.. వీటితో పోల్చితే, యూ ట్యూబ్ కిక్కే వేరప్పా.
యూ ట్యూబ్ చాలామందికి చాలా చాలా అవకాశాల్ని కల్పిస్తోంది. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ‘యూ ట్యూబర్’గా (Youtuber) మారడం కూడా ఓ అద్భుతమైన మార్గం. కానీ, అదే యూ ట్యూబ్ కొంత ‘చెత్త’కి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందన్నది నిర్వివాదాంశం.
‘ఎక్కువమంది వ్యూయర్స్’ని రాబట్టుకునేందుకు కొందరు యూ ట్యూబర్స్ తమ ఛానెల్స్‌ని ‘చెత్త’తో నింపేస్తున్నారు. తాజాగా హీరోయిన్ నందితా శ్వేత – హీరో విశ్వక్ సేన్ గురించి ఓ యూ ట్యూబర్ తన పైత్యాన్నంతా రంగరించేశాడు.
నందిత శ్వేత నటించిన ‘అక్షర’ సినిమాకి సంబంధించిన ఈవెంట్‌కి విశ్వక్‌సేన్ హాజరైతే, అతనికి నందిత (Nandita Swetha) థ్యాంక్స్ చెబితే, ఆ చెప్పిన విషయంతో సంబంధం లేని విధంగా థంబ్‌నెయిల్ క్రియేట్ చేశాడు సదరు యూ ట్యూబర్.
లోపల వీడియోలో ఏమీ లేదుగానీ, ఇందుకోసం వాడిన ‘థంబ్’ (Vishwaksen Warning To Youtuber) మాత్రం అత్యంత జుగుప్సాకరంగా తయారైంది. నిజానికి, యూ ట్యూబ్‌లో ఇలాంటి వింతలు చోటు చేసుకోవడం ఇదే కొత్త కాదు.
కొన్నాళ్ళ క్రితం హీరో సునీల్ (Comedy Hero Sunil) ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యడానీ, పరిస్థితి అత్యంత విషమంగా వుందని యూ ట్యూబ్‌లో ఓ వీడియో సంచలనంగా మారింది. నిజానికి, ఆ వీడియోలో అంత కంటెంట్ ఏమీ లేదు.
హీరోయిన్ల మీద గాసిప్స్ విషయంలో యూ ట్యూబ్‌లో కనిపించే చెత్త అంతా ఇంతా కాదు. ఆ తరహా చెత్తకే ఎక్కువ ఫాలోవర్స్ కూడా లభిస్తున్నారు. కానీ, దీనికి ఎక్కడో ఓ చోట ఫుల్ స్టాప్ పడాల్సిందే.
‘ఆ వీడియో, థంబ్ పెట్టినోడెవడోగానీ.. 24 గంటల్లోగా తొలగించాలి.. లేదంటే, వాడింటికెళ్ళి ఆ పని నేనే వాడితో చేయిస్తా..’ అంటూ హీరో విశ్వక్ సేన్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించాడు.
ఇలా హెచ్చరించి ఊరుకుంటే సరిపోదు, పోలీసుల్ని (Vishwaksen Warning To Youtuber) ఆశ్రయించాలి.. అలాంటోళ్ళకి సరైన శిక్ష పడేదాకా నిలబడాలి. అనసూయ (Anasuya Bharadwaj), రష్మి (Rashmi Gautham).. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో బాధితులు.. వాళ్ళంతా తమ ఆవేదనను సోషల్ మీడియా వేదికగా వెళ్ళగక్కారు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, ఏం లాభం.?
ఆయా కేసుల విచారణ ఎక్కడిదాకా వెళ్ళిందో ఎవరికీ తెలియదు. ‘మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా.? మీకు నైతిక విలువల్లేవా.? మీకు సిగ్గు లేదా.?’ వంటి ప్రశ్నలు సో కాల్డ్ యూ ట్యూబర్స్‌ని ఏమీ చేయలేవు. ఎందుకంటే, చేస్తున్నది నీఛమైన పని అని తెలిసీ, డబ్బు సంపాదనే పరమావధిగా పనిచేసేవాల్ళకి సిగ్గూ ఎగ్గూ ఎలా వుంటాయ్.?
