Viswak Sen Original Name.. మాస్ కా దాస్ అంటూ తెలుగు ప్రేక్షకుల్ని తనదైన హీరోయిజంతో ఆకట్టుకుంటోన్న కుర్రోడు విశ్వక్ సేన్. ‘విశ్వక్ సేన్’ అనే పేరుకు అస్సలు పరిచయం అక్కర్లేదు.
అయితే, దినేష్ నాయుడు సంగతేంటీ మరి. ఎవరీ దినేష్ నాయుడు.? అని ఆశ్చర్యపోతున్నారా.? మనం విశ్వక్ సేన్ అని పిలుచుకుంటున్న ఈ మాస్ కా దాస్ అసలు పేరే దినేష్ నాయుడు.
దినేష్ నాయుడు.. విశ్వక్ సేన్‌గా ఎందుకు మారాడు.? ఏంటా కథ.? తెలుసుకోవాలంటే మీకీ విషయం తెలియాల్సిందే.
Viswak Sen Original Name.. అలా అదృష్టం వరించింది.!
‘వెళ్లిపోమాకే’ సినిమాతో విశ్వక్ సేన్ కెరీర్ స్టార్ట్ చేశాడు. ఈ సినిమా పూర్తయ్యాక దాదాపు రెండేళ్లు రిలీజ్ కాకుండా ఆగిపోయిందట.
పూర్తయిన సినిమా రిలీజ్ కాకపోతే ఆ బాధ ఎలా వుంటుందో.. అలాగే, అంత గ్యాప్ తీసుకుని రిలీజ్ అయ్యాకా వచ్చే ఆ ఆనందం ఏ స్థాయిలో వుంటుందో రెండూ తనకు బాగా తెలుసంటున్నాడు విశ్వక్ సేన్.
ఆ టైమ్‌లోనే ఓ జ్యోతిష్య పండితుడు చెప్పిన మాట.. పేరు మార్చుకోమని. అలా పేరు మార్చుకున్న నెల రోజులకే సినిమా రిలీజైందట.
ఆ వెంటనే ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో ఛాన్స్ రావడం.. ఆ తర్వాత ‘ఫలక్‌నుమా దాస్’తో సెన్సేషనల్ హీరో అనిపించుకోవడం చకచకా జరిగిపోయాయట.
కొందరు ఇదేం పేరు.. అంటూ ఎగతాళి చేసినప్పటికీ అవేమీ పట్టించుకోలేదట. వెనక్కి తిరిగి చూడలేదట విశ్వక్ సేన్ (Vishwak Sen).
పెద్ద పెద్ద స్కెచ్‌లే వేస్తున్నాడట.!
అలా దినేష్ నాయుడు.. విశ్వక్ సేన్ (Vishwak Sen) గా అవతారమెత్తి టాలీవుడ్‌లో ఓ సెన్సేషనల్ యంగ్‌స్టర్ అయిపోయాడు. యూత్ ఐకాన్‌గా మారిపోయాడు.

కాస్త ఆటిట్యూడ్ ఎక్కువ అనే టాక్ వున్నప్పటికీ ఆ ఆటిట్యూడే మనోడ్ని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునేలా చేసింది.
జీవితంలో ఏదైనా సాధించాలంటే ఓర్పు ఎంతో అవసరం.. అని అప్పుడే తనకి అర్ధమైందంటున్నాడు మాస్ కా దాస్. అప్పటి నుంచీ ఏ సమస్య వచ్చినా నెవ్వర్ గివప్ అనే ఆలోచన పాఠిస్తున్నాడట.
Also Read: ‘వ్యూహం’.! రామ్ గోపాల్ వర్మ మార్కు వెన్నుపోటు.?
ఇటీవలే ‘దాస్ కా ధమ్కీ’ అంటూ ప్రేక్షకుల్ని పలకించిన విశ్వక్ సేన్, ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నాడు.
అన్నట్లు తన సినిమా ఫంక్షన్ల కోసం బాలయ్య, ఎన్టీయార్ వంటి స్టార్స్‌ని గెస్ట్‌లుగా తీసుకురావడం ఈ మధ్య చూస్తున్నాం.
ఇదంతా చూస్తుంటే.. త్వరలోనే ఓ భానీ మల్టీ స్టారర్ ఓకే చేసుకునేందుకు భారీ రేంజ్‌లోనే స్కెచ్ వేస్తున్నాడనిపిస్తోంది విశ్వక్ సేన్ (Vishwak Sen).
బాలయ్యకూ, ఎన్టీయార్‌కీ బిస్కెట్స్ వేస్తూ, వాళ్ల మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ బిస్కెట్లన్నీ ఆ స్కెచ్‌లో భాగమే అనిపిస్తోంది.
చూశారా.? పేరు మహత్యం.! మనోడ్ని ఏ రేంజ్‌కి తీసుకెళ్లిందో.! ఇలా చాలా మంది స్టార్స్ తమ ఒరిజినల్ పేర్లను మార్చుకుని సినిమాల్లో రాణించిన, రాణిస్తున్న సంగతి తెలిసిందే.