బిగ్‌బాస్‌లో (Bigg Boss 3 Telugu) హై ఓల్టేజ్ యాక్షన్ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే, చేతల్లో కాదు, ఇప్పటికి మాటల్లోనే (Varun Sandesh Vithika Sheru Mahesh Vitta). ఇంతవరకూ కామ్‌గా కనిపించిన వరుణ్ సందేశ్ (Varun Sandesh) ఉగ్రరూపాన్ని చూపించాడు. భార్య వితికా షెరు (Vithika Sheru) విషయంలో తన తోటి హౌస్ మేట్ అయిన మహేష్ విట్టాతో గొడవ పడ్డాడు.
ఒకానొక సందర్భంలో మహేష్ తనను ధూషించాడంటూ వితికా ఆరోపించింది. ఒక్క సందర్భమే కాదు, రెండు, మూడు సార్లు మహేష్ తన పట్ల హార్ష్‌గా ప్రవర్తించాడంటూ వితికా (Varun Sandesh Vithika Sheru Mahesh Vitta Bigg Boss) ఆరోపణలు చేసింది. ఇదే విషయమై వితికా, వరుణ్‌కి కూడా ఫిర్యాదు చేసింది. దాంతో వరుణ్ ఉగ్రరూపం దాల్చాడు. నా పెళ్లాన్ని అలాంటి మాటలు మాట్లాడతావా.? రెస్పెక్ట్ లేదా.? నీకు అంటూ గొడవకు దిగాడు.
ఆడవాళ్లను అలాంటి మాటలనడానికి సిగ్గు లేదా.? సిగ్గు లేనోడా.? అంటూ వరుణ్ ఆవేశంతో ఊగిపోయాడు. వరుణ్‌కీ, మహేష్‌కీ మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ జోరుగా సాగింది. అప్పటివరకూ కామ్‌గా ఉన్న మహేష్ కూడా గట్టిగా గొంతు విప్పాడు. దాంతో హౌస్ మేట్స్ వీరిద్దర్నీ వారించే ప్రయత్నం చేశారు. అయినా, వరుణ్ ఆగకపోవడంతో గొడవ ముదిరి పాకాన పడింది. కొడతావా.?
దమ్ముంటే కొట్టు.. రారా కొట్టుకుందాం.. అంటూ మహేష్ పైకి దూసుకెళ్లాడు వరుణ్. అక్కడితో ఈ ఇష్యూ చల్లారలేదు. మహేష్, వరుణ్‌ని కామెడీ ఫేస్ (Varun Sandesh Vithika Sheru Mahesh Vitta Bigg Boss) అని వెటకరిస్తే, అవును నా ఫేస్ ఇంతే కామెడీగానే ఉంటుంది.. హీ హీ హీ.. అని కామెడీ చేశాడు. దానికి అవును నా మాటింతే హార్ష్‌గానే ఉంటుంది అంటూ మహేష్ కౌంటర్ ఇచ్చాడు.
బిగ్‌బాస్‌లో (Bigg Boss Telugu 3) ఈ పరిస్థితిని నిర్వాహకులు ముందే ఊహించారేమో. ఈ మసాలా కోసమే పెళ్లయిన జంటని లోపలికి పంపించే ఆలోచన చేశారేమో బిగ్‌బాస్ (Bigg Boss Telugu Season 3) నిర్వాహకులు. ఒకవేళ అదే నిజమైతే, వారి ఆలోచన పలించినట్లే. సోషల్ మీడియాలో ఇదే విషయమై పెద్ద రచ్చ జరుగుతోంది. ఇటు మహేష్ విట్టా (Mahesh Vitta) ఫ్యాన్స్, అటు వరుణ్ – వితికా ఫ్యాన్స్ మధ్య సోషల్ వార్ నడుస్తోంది. చూడాలి మరి, ఈ వార్‌కి ఎలా బ్రేక్ పడుతుందో.
ఇదిలా వుంటే, ఈ రోజు బిగ్ హౌస్ చాలా విషయాలతో ఒకటికి పదిసార్లు.. అన్నట్టు వేడెక్కుతూనే వచ్చింది. హేమ – రాహుల్ (Rahul Sipligunj) మధ్య గొడవ.. శ్రీముఖి (Sree Mukhi) – హేమ (Hema) మధ్య రచ్చ.. అలీ రెజా (Ali Reza) – వరుణ్ (Varun Sandesh)మధ్య స్వల్పంగా గందరగోళం.. చపాతీ కోసం ఓవరాక్షన్ చేసిన పునర్నవి గోపాలం (Punarnavi Bhupalam).. ఇలా హీట్ బాగానే కనపించింది.