Waltair Veerayya and Veerasimhareddy సంక్రాంతి పండక్కి రెండు పెద్ద సినిమాలు.. అందునా బాలకృష్ణ, చిరంజీవి నడుమ సినిమా పోటీ అంటే.. ఆ కిక్కే వేరప్పా.!
‘ముందైతే నా సినిమా చూడు.. ఆ తర్వాత మీ నాన్నగారి సినిమా చూడు..’ అని బాలకృష్ణ (Nandamuri Bala Krishna), రామ్ చరణ్‌తో చెప్పాడు.
ఇద్దరి మధ్యా పోలిక అనవసరం. కానీ, సోకాల్డ్ కొన్ని వెబ్ మీడియా సంస్థల నిర్వాకంతో అనవసరపు రచ్చ జరుగుతోంది అభిమానుల మధ్య.!
Mudra369
‘ఏమో, అమెరికాలో వీర సింహా రెడ్డి సినిమానే రామ్ చరణ్ చూస్తాడేమో..’ అని చిరంజీవి (Megastar Chiranjeevi) కూడా ఓ సందర్భంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Waltair Veerayya and Veerasimhareddy వీర సింహా రెడ్డి మొదలెట్టాడు..
సంక్రాంతికి తెలుగు సినిమాల్ని తొక్కేసి, అరవ సినిమాని తెలుగు ప్రేక్షకుల నెత్తిన బలవంతంగా రుద్దాలనుకున్న దిల్ రాజు పప్పులుడకలేదు.
‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలపై క్రియేట్ అయిన హైప్‌తో ‘వారసుడు’ వెనక్కి తగ్గాడు.
దాంతో ‘వీర సింహా రెడ్డి’కి లైన్ క్లియర్ అయ్యింది. తొలి రోజు థియేటర్ల వద్ద బాలయ్య హంగామా.. ఆపై వసూళ్ళ ప్రభంజనం చూశాం.
వాల్తేరు వీరయ్య అదరగొట్టాడు..
కొందరి అత్యుత్సాహం కారణంగా ‘వీర సింహా రెడ్డి’పై కొంత నెగెటివిటీ ఏర్పడింది. అది ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి అడ్వాంటేజ్ అయ్యింది.

వాస్తవానికి ‘వాల్తేరు వీరయ్య’ కూడా ఆ నెగెటివిటీతోనే సత్తా చాటింది. రెండు సినిమాలూ మాస్ ఆడియన్స్‌ని టార్గెట్ చేసుకున్నవే.
దాంతో, ఎవరి స్థాయిలో వారు.. బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి వసూళ్ళ జాతర సృష్టించేశారు. చిరంజీవి, బాలయ్య.. ఇద్దరూ వంద కోట్లు కొల్లగొట్టేశారు ఆల్రెడీ.!
Also Read: సినీ శ్రామికుడీ చిరంజీవుడు.! ‘మెగా’ తూటాలెవరిపై పేల్చాడు.?
ఓవర్సీస్‌లో ‘వాల్తేరు వీరయ్య’ 1.7 మిలియన్ డాలర్లు ఇప్పటికే వసూలు చేయగా.. ‘వీర సింహా రెడ్డి’ 1 మిలియన్ క్లబ్‌లోకి వెళ్ళబోతున్నాడు.
ఇద్దరి మధ్యా పోలిక అనవసరం. కానీ, సోకాల్డ్ కొన్ని వెబ్ మీడియా సంస్థల నిర్వాకంతో అనవసరపు రచ్చ జరుగుతోంది అభిమానుల మధ్య.!