Waltair Veerayya Vs Veerasimhareddy ఓవర్సీస్‌లో ఈ సంక్రాంతి సినీ యుద్ధం కనీ వినీ ఎరుగని రీతిలో జరిగింది.. రెండు పెద్ద సినిమాల నడుమ.
ఒకటేమో నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహా రెడ్డి’ కాగా, ఇంకొకటి ‘మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘వాల్తేరు వీరయ్య’.
ఇంతకీ, ఈ యుద్ధంలో గెలుపు ఎవరిది.? ఇంకెవరిది ‘వాల్తేరు వీరయ్య’దే. ప్రీమియర్స్ విషయంలో నానా హంగామా నడిచింది రెండు సినిమాల మధ్యా.
ఇక్కడ క్లియర్ విన్నర్ ఎవరో తేలిపోయింది. మెగాస్టార్ చిరంజీవిదే పై చేయి అయ్యింది ఓవర్సీస్‌లో నందమూరి బాలకృష్ణ మీద.
Mudra369
నిజానికి, మాస్ సినిమాలకి ఓవర్సీస్‌లో అంతగా రీచ్ వుండదు. కానీ, ‘అఖండ’ సినిమా తర్వాత బాలయ్య నుంచి వస్తోన్న సినిమా కావడంతో ‘వీర సింహా రెడ్డి’ అంచనాలకు మించి, ప్రీమియర్స్‌కి టిక్కెట్ సేల్స్ నమోదు చేసింది.
Waltair Veerayya Vs Veerasimhareddy.. అత్యుత్సాహమే కొంప ముంచింది..
అయితే, ఇక్కడా కొందరి అత్యుత్సాహం ‘వీర సింహా రెడ్డి’కి పెద్ద మైనస్ అయ్యింది. ప్రీమియర్స్ నెంబర్స్ బాగానే కనిపించినా, ఫస్ట్ డే వసూళ్ళు చాలా దారుణంగా తయారయ్యాయి.
హాఫ్ మిలియన్ (5 లక్షల డాలర్లు) దాటి ప్రీమియర్స్ ద్వారానే వసూలు చేసిన ‘వీర సింహా రెడ్డి’ తొలి రోజు పట్టుమని లక్ష డాలర్లు కూడా దక్కించుకోలేకపోయింది.

‘వాల్తేరు వీరయ్య’ పరిస్థితి వేరు. ‘వీర సింహా రెడ్డి’తో సమానంగా ప్రీమియర్స్ సేల్స్ రాబట్టిన ‘వాల్తేరు వీరయ్య’, ఫస్ట్ డే సుమారుగా 2 లక్షల డాలర్ల వరకు కొల్లగొట్టడం గమనార్హం.
అంటే, ఇక్కడ క్లియర్ విన్నర్ ఎవరో తేలిపోయింది. మెగాస్టార్ చిరంజీవిదే పై చేయి అయ్యింది ఓవర్సీస్‌లో నందమూరి బాలకృష్ణ మీద.
రెండు సినిమాలూ ‘మైత్రీ మూవీ మేకర్స్’ నిర్మించినా, పబ్లిసిటీ పరంగా ‘వీర సింహా రెడ్డి’ సినిమా మీద నిర్మాణ సంస్థ అదనపు ప్రేమ చూపించిన మాట వాస్తవం.
వాల్దేరు వీరయ్యదే హవా..
ఓవర్సీస్‌లో సినిమాలపై తెలుగుదేశం పార్టీకి అదనపు అడ్వాంటేజ్ వుంది. అవేవీ ‘వీర సింహా రెడ్డి’ని రేసులో ముందుకి తీసుకెళ్ళలేకపోయాయి.
పైగా, ప్రదర్శించిన అత్యుత్సాహం ‘వీర సింహా రెడ్డి’ కొంప ముంచింది. బల్క్ బుకింగ్స్ చేసినా థియేటర్లలో జనం కనిపించలేదు ‘వీర సింహా రెడ్డి’కి. ‘వాల్తేరు వీరయ్య’ విషయంలో పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది.
Also Read: ‘వాల్తేరు వీరయ్య’ పూనకాలు.! వాళ్ళకి నిద్ర లేని రాత్రులు.!
తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘వీర సింహా రెడ్డి’ రెండో రోజుకి తేలిపోయింది. ‘వాల్తేరు వీరయ్య’ మేనియా కనిపిస్తోంది.
ఓ వర్గం మీడియా పూర్తిగా బాలయ్యను భుజాన మోసి, చిరంజీవికి వ్యతిరేకంగా ప్రచారం చేసినా.. ‘వాల్తేరు వీరయ్య’ విజయాన్ని అడ్డుకోలేకపోయారు.