Wamiqa Gabbi Khufiya.. అప్పుడెప్పుడో ‘భలే మంచి రోజు’ అంటూ తెలుగు తెరకు పరిచయమైంది వామికా గబ్బి. సుధీర్ బాబు హీరోగా నటించిన సినిమా అది.
ఆ తర్వాత మళ్ళీ వామిక తెలుగు తెరపై కనిపించలేదు. కొన్ని బాలీవుడ్ సినిమాల్లోనూ నటించిన వామిక, వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ వస్తోంది.
తాజాగా, ‘కుఫియా’ అనే సినిమాలో నటించింది వామిక. టబు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించింది.
కాగా, కన్న కొడుకు కోసం తల్లడిల్లే దేశభక్తి కలిగిన తల్లి పాత్రలో వామిక (Wamiqa Gabbi) ఒదిగిపోయింది.

దేశాన్ని, దేశ వ్యతిరేక శక్తుల నుంచి రక్షించేందుకు ప్రయత్నించే టీమ్.. అందులో ఓ ‘వెన్నుపోటుదారుడు’, ఆ వెన్నుపోటుదారుడికి భార్యగా వామిక నటించింది ‘కుఫియా’లో.
నిజానికి, తొలుత వామిక పాత్రపైనే అనుమానాలొస్తాయ్.! స్క్రీన్ మీద వామిక కనిపించిన ప్రతిసారీ, ఆమె నటనకు ఫిదా అవుతాం.
కొంచెం గ్లామరస్ టచ్ ఇచ్చినట్లే ఇచ్చి, ఆమె పాత్రలో చాలా ఎమోషన్స్ పండేలా చేయగలిగాడు దర్శకుడు.
‘జూబ్లీ’ వెబ్ సిరీస్‌లో అయితే వామిక నటన వేరే లెవల్.! ‘జూలీ’ చూసినవాళ్ళకీ, ‘కుఫియా’ని చూసినవాళ్ళకీ, ఇంత టాలెంట్‌ని తెలుగు సినిమా ఎలా మిస్సయ్యింది.? అని అనిపించకమానదు.

టైమ్ అంతే.! అస్సలేమాత్రం నటన చేతకానోళ్ళు కూడా, లక్కుతో నెట్టుకొచ్చేస్తుంటారిక్కడ అదే లక్కు లేకపోతే, ఎంత టాలెంట్ అయినా వృధా.!
నువ్వు నాన్నవి అయ్యావురా.! సరిగ్గా పదిహేడేళ్ళ క్రితం ఇదే రోజు విన్న మాట.! నా కొడుకు, నాకంటే ఎత్తుకి ఎదిగేశాడు.!