Why No Hanuman Logo వివాదం లేకపోతే జనానికి తెల్లారడంలేదు.!
పొద్దున్న లేస్తే వివాదం.. ఆ వివాదంతోనే రోజుకి స్వాగతం పలకాలి.. ఆ వివాదంతోనే రోజుకి ముగింపు కూడా పలకాలి. అలా తయారైంది పరిస్థితి.
ట్రైనీ యుద్ధ విమానం ‘టెయిల్’ మీద హనుమంతుడి బొమ్మ వివాదాస్పదమవుతోంది.
కొత్త తరం యుద్ధ విమానం (శిక్షణావసరాల నిమిత్తం తయారు చేయబడింది) హెచ్ఎల్ఎఫ్‌టి-42. దీనికి సంబంధించిన ప్రోటోటైప్‌ని బెంగళూరు ఎయిర్ షో సందర్భంగా ప్రదర్శనకు పెట్టారు.
Why No Hanuman Logo.. బొమ్మ ఎందుకు వుండాలి.? ఎందుకు వుండకూడదు.?
‘యుద్ధ విమానాలపై దేవుళ్ళ బొమ్మలేంటి.?’ అన్న విమర్శలు రావడంతో, ఆ హనుమంతుడి బొమ్మని తొలగించారు నిర్వాహకులు.
ఇకనేం, ఎందుకు తొలగించారు.? అంటూ వివాదం మొదలైంది. ‘వై నై హనుమాన్ లోగో’ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
న్యూస్ ఛానళ్ళలో డిబేట్లు మామూలే. జనంలో ఈ అంశంపై పెద్దయెత్తున దుమారం రేపుతోంది. భిన్నత్వంలో ఏకత్వం మన ప్రజాస్వామ్యం తాలూకు గొప్పతనం.

భిన్న మతాలు, భిన్న సంస్కృతులు.. అయినాగానీ, దేశం కోసం.. అంతా ఒక్కతాటిపైకి వస్తారు. అలాంటప్పుడు, హనుమాన్ బొమ్మతో ఈ వివాదం ఎందుకు.? అన్నదే అసలు చర్చ.
సున్నితమైన అంశం.. ఇలాగేనా వ్యవహరించేది.?
సున్నితమైన ఇలాంటి అంశాల పట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. గతంలో భారత్ తయారీ యుద్ధ విమానానికి ‘మారుత్’ అని పేరుండేది.
ఆ ‘మారుత్’ (HAL Marut) తర్వాత ఇప్పుడీ ట్రైనర్ యుద్ధ విమానాన్ని కూడా హెచ్ఎఎల్ తయారు చేసింది. ఆ ‘మారుత్’ని పరిగణనలోకి తీసుకునే, హనుమంతుడి బొమ్మ పెట్టారన్నది ఓ వాదన.
Also Read: ‘చిత్రం’ చెప్పే కథ.! రాసుకున్నోడికి రాసుకున్నంత.!
ఎవరి గోల వారిదే.! ఈ రచ్చ ఇప్పట్లో ఆగదు. కొన్నాళ్ళ తర్వాత మాత్రం ఈ వివాదం కాలగర్భంలో కలిసిపోతుంది. ఈలోగా యాగీ మాత్రం పీక్స్‌లో నడుస్తుందన్నది నిర్వివాదాంశం.
ఈ తరహా వివాదాల్ల వీసమెత్తు ఉపయోగం దేశానికి వుంటుందా.?