Wife Shocks Husband..భర్త, భార్యని వదిలేస్తే.. అదే పెద్ద రగడ.! కేసులు, కోర్టులు.. అబ్బో, ఆ పితలాటకం మామూలుగా వుండదు. మరి, భార్యే భర్తని వదిలేస్తేనో.?
అయ్యోపాపం.. అని సమాజం కూడా జాలి పడదు. ‘నువ్వో అసమర్థుడివి..’ అని ముద్ర వేసేస్తుంటుంది.! మొన్నామధ్య ఓ సినిమా కూడా వచ్చింది ఇదే కాన్సెప్టుతో.!
సరే, అసలు కథలోకి వచ్చేద్దాం. నిజానికి, ఇది కథ కాదు.. వ్యధ. ఔను, ఓ భార్యా బాధితుడి వ్యధ.
భార్యతో కలిసి వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకునే క్రమంలో తొలుత దేవాలయానికి వెళ్ళి, ఆ తర్వాత బీచ్ వద్దకు వెళ్ళాడో పురుష పుంగవుడు.
Wife Shocks Husband అలా ఆమె ఎగిరిపోయింది.!
సముద్ర కెరటాలు అలా అలా ఎగసిపడుతోంటే.. ఆ ఆహ్లాకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ, ఆ భార్యాభర్తలిద్దరూ ముచ్చట్లలో మునిగిపోయారు.
ఇంతలో, భర్త ఫోన్‌కి ఏదో మెసేజ్ వచ్చిందట. ఆ మెసేజ్ ఇలా చూసి, అలా తల పైకెత్తేసరికి.. భార్య కన్పించలేదు. అక్కడున్నవారందర్నీ వాకబు చేశాడా భర్త.
ఆచూకీ దొరక్కపోవడంతో, సముద్రంలో గల్లంతయిపోయిందేమోనని భావించి, పోలీసులకూ సమాచారమిచ్చాడా అమాయకుడు. హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి.. అధికార యంత్రాంగం గాలింపు చర్యలూ చేపట్టింది.
కట్ చేస్తే.. భార్యామణి జంప్.!
సముద్రం ఒడ్డున గల్లంతైన ఆ స్త్రీ జాతి రత్నం.. బెంగళూరులో తేలింది. ఇంకో వ్యక్తిని పెళ్ళి చేసుకున్నాననీ, తనను ఎవరూ వెతకొద్దని చెబుతూ, తల్లిదండ్రులకు సమాచారం పంపింది.
తన ఆచూకీ కోసం సముద్రంలో గాలించిన అధికార యంత్రాంగానికి క్షమాపణ కూడా చెప్పిందండోయ్.! స్టోరీ అదిరింది కదూ.! ఇది కథ కాదు, వ్యధ.! ఔను, భార్యా బాధితుడి వ్యధ ఇది.

నిజ జీవిత గాధల్నే సినిమాలుగా తీస్తుంటారా.? సినిమాల్ని చూసి ఇన్‌స్పైర్ అయి, ఇలా ‘జంప్’ చేస్తుంటారా.? ఏదైతేనేం, మాంఛి స్టఫ్ వుంది కదూ ఈ స్టోరీలో.!
Also Read: ‘ఆన్ డ్యూటీ’.! నెటిజనాన్ని కెలికేసిన రవితేజ డైరెక్టర్.!
ఇలాంటి కథలు ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయాయి. ఊరికినే మగాడ్ని ఆడిపోసుకుంటున్నారుగానీ.. ఆడాళ్ళూ తక్కువోళ్ళేమీ కాదు.!
కాస్తలో బతికిపోయాడుగానీ, లేకపోతే.. ‘నువ్వే చంపావ్ నీ భార్యని..’ అంటూ ఫాఫం అమాయకుడి మీద పెద్ద అబాంఢమే పడిపోయేది.
సముద్రంలోకి భార్యను తోసేసిన కసాయి భర్త.. అంటూ మీడియా వెకిలి చేష్టలకూ ఆస్కారం లేకుండా పోయిందాయె.! ఇదండీ లోకం.. ఇలా తయారయ్యిందండీ వ్యవహారం.!
ఔను, జనాలు బాగా సెడిపోయారు మరి.!