Women Hip Chain.. చిట్టి నడుమునే చూస్తున్నా.. చిత్ర హింసలై ఛస్తున్నా.. అంటూ పాటేసుకుంటాడో హీరో ఓ తెలుగు సినిమాలో.!
‘ఆమె’ అందాన్ని వర్ణించే క్రమంలో ఆ నడుముని బోల్డంతమంది కవులు, బోల్డన్ని మాటల ప్రయోగాలు చేసేశారు. ప్రతి మాటా ప్రత్యేకమే.!
కొందరైతే, నడుముని నాగు పాముతో పోల్చుతారు. ఇంకొందరు నదులతో పోల్చుతారు. ఆ నడుముకి వున్న ప్రత్యేకత అలాంటిది మరి.

అందుకే, ఆ నడుముని ఇంకాస్త అందంగా మలచుకునేందుకు అందాల భామలు పడరాని పాట్లూ పడుతుంటారు.. నానా రకాల కసరత్తులూ చేస్తుంటారు.
Women Hip Chain.. చక్కని నడుముకి బంగారు గొలుసు..
చూస్తున్నారుగా, ఫొటోలోని భామ నడుముకి ‘నగ’ని ఎంత అందంగా అలంకరించిందో.! ఇప్పుడు ఇదో కొత్త ట్రెండ్‌గా మారిందండోయ్.!
చీరకట్టులోనూ నడుముకి బెల్టుల్లాంటివి అలంకరించడం ఓ ఫ్యాషన్ అయితే, నగల్ని ధరించడం అనేది ఎప్పటినుంచో వున్న సంప్రదాయం అనొచ్చు.

వడ్డాణాలు ఓల్డ్ ఫ్యాషన్.! ఇదిగో, ఇలాంటి బంగారు గొలుసులు నయా ట్రెండ్.! ఫంక్షన్లలో అయితే వడ్డాణాలు.. పార్టీల్లో అయితే, సన్నటి గొలుసులు.!
నడుము వంపుల్ని ఈ ‘గొలుసులు’ ఇంకా బాగా ఎలివేట్ చేస్తాయట. అద్గదీ అసలు సంగతి.! కాదేదీ గ్లామర్‌కి అనర్హం.. అన్నమాట.
మెడ వంపుల్లోనూ.. నడుము వంపుల్లోనూ.!
మెడ వంపుల్లోనే కాదు, నడుమొంపుల్లోనూ అందంగా ఒదిగిపోయే ఇలాంటి గొలుసులకు ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగిపోయిది.!

అందం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందంటారు.! అందులో నిజమెంత.? అన్న విషయాన్ని పక్కన పెడితే, నడుముకి ఇచ్చే ఆ గ్లామర్ టచ్ మాత్రం కుర్రకారులో హీటు పెంచుతుందన్నది నిర్వివాదాంశం.