WomenInBlue World Cricket Champions.. మిథాలీ రాజ్ గురించి తెలుసు.. స్మృతి మంథాన గురించి కాస్త తెలుసు.! మరి, హర్మన్ ప్రీత్ కౌర్ గురించో.!
చాలా పేర్ల గురించి, చాలా సంవత్సరాలపాటు మనం మాట్లాడుకుంటాం. దీప్తి శర్మ, షెఫాలీ, జెమీమా.. ఇలా చాలామంది గురించి మాట్లాడుకుంటూనే వుంటాం.
ఔను, వీళ్ళంతా తమ గురించి, ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేశారు. ఎందుకంటే, ప్రపంచ క్రికెట్‌లో ఛాంపియన్లుగా నిలిచారు మరి.!
క్రికెట్ అంటే, కేేవలం మగాళ్ళకే.. అనే మాట ఒకప్పుడు.! మైదానంలోకి దిగాక, ఆడ.. మగ.. తేేడా ఏం లేదు.
WomenInBlue World Cricket Champions.. మగాళ్ళేనా.? మహిళలూ విజేతలే..
బంతితో అయినా, బ్యాట్‌తో అయినా.. వికెట్ల వెనకాల అయినా, మెరుపు ఫీల్డింగ్ విషయంలో అయినా.. అన్నిట్లోనూ, మగాళ్ళకు మించి అదరగొట్టేశారు.
ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ‘విమెన్ ఇన్ బ్లూ’ ఎలా సత్తా చాటిందో చూశాం. సౌతాఫ్రికాతో అయితే, ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్.. అంతకు మించి.
ఇక్కడో విషయం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. అదేంటంటే, సౌతాఫ్రికా మహిళా క్రికెటర్లు, మైదానంలో మెరుపుల్లా కదిలారు.

సౌతాఫ్రికా మహిళలకు ధీటుగా, మన మహిళా క్రికెటర్లూ ఫీల్డింగ్‌లో సత్తా చాటారు. ఫలితం, సౌతాఫ్రికాని ఆలౌట్ చేసి, ఛాంపియన్లుగా నిలిచింది మెన్ ఇన్ బ్లూ టీమ్.!
Also Read: లక్కీ లాటరీ.! రాత్రికి రాత్రే 240 కోట్లు కొల్లగొట్టేశాడు.!
కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, మ్యాచ్ విన్నింగ్ క్యాచ్ అందుకుంది. అప్పటిదాకా, మైదానంలో ఆమె తన ఇష్ట దైవాన్ని తలచుకుంటూనే వుంది.
బంతి బంతికీ ఉత్కంఠ.. ఆ ఉత్కంఠ అంతా, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌లోనే కనిపించింది. విన్నింగ్ క్యాచ్ అందుకోగానే, హర్మన్ ప్రీత్ కౌర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ్.
సుదీర్ఘ కాల నిరీక్షణ అనంతరం, ‘ప్రపంచ ఛాంపియన్’ అనే టైటిల్‌ని మెన్ ఇన్ బ్లూ గెలుచుకుంది. యావత్ ప్రపంచం, మన మహిళా క్రికెటర్లను అభినందనలతో ముంచెత్తుతోంది.

క్రికెట్‌లో మహిళలకు ఎదురయ్యే అవమానాలు అన్నీ ఇన్నీ కావు. నిజానికి, ఇంటి నుంచే మొదలవుతాయవి.
‘నీకెందుకు క్రికెట్.? ఆడ పిల్లవి..’ అంటూ వెనక్కి లాగేసే తల్లిదండ్రులు చాలామందే వున్నారు. ఇకపై, అలా ఆడపిల్లల్ని ఏ తల్లిదండ్రులూ వెనక్కి లాగే పరిస్థితి లేదు.
‘గేదెలా వుంది.. మైదానంలో ఆ ఫీట్లు ఏంటి.?’ అనే వెటకారాలకు ఇకపై ఆస్కారమే వుండదు. నల్లగా వుంది, తెల్లగా వుంది.. ఇలాంటి డిస్క్రిమినేషన్స్ ఇంకపై వుండబోవు.

బాబ్డ్ హెయిర్ అయినా, పోనీ టెయిల్ అయినా.. వీటి మీద కూడా ఇకపై కామెంట్లకు ఆస్కారమే లేదు.! ఎందుకంటే, విశ్వ విజేత విమెన్ ఇన్ బ్లూ.!
విమెన్ ఇన్ బ్లూ బృందంలో ప్రతి మహిళా క్రికెటర్.. ఓ శివంగి.! ఆకాశంలో సగం.. అన్నింటా సగం.. క్రికెట్‌లోనూ సగం.! కంగ్రాట్స్ ఛాంపియన్స్.!
