Young Tiger NTR.. యంగ్ టైగర్ ఎన్టీయార్ తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లీషుల్లోనూ అనర్గళంగా మాట్లాడగలడు. తమిళ్ కూడా తెలుసు. తమిళ్ కంటే కన్నడ ఇంకా బాగా మాట్లాడతాడు.!
ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. అయితే, ఇంగ్లీషులో అమెరికన్ యాక్సెంట్ కూడా చాలా బాగా మాట్లాడతాడని ఈ మధ్యనే అందరికీ తెలిసిందే.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ‘ఆస్కార్’ రేసులో ముందుకు నడిపేందుకోసం చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది.
దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీయార్.. ఈ మేరకు అమెరికాలో సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే.
Young Tiger NTR.. ఎన్టీయార్‌పై విపరీతమైన ట్రోలింగ్..
‘నాటు నాటు’ పాటకి గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కగా, ఆ పురస్కారాల ప్రధానోత్సవానికి హాజరైనప్పుడు, అమెరికన్ మీడియాతో ఎన్టీయార్ మాట్లాడాడు.

అప్పుడే, ఆ సందర్భంలో ఎన్టీయార్ వాడిన అమెరికన్ యాక్సెంట్.. ట్రోలింగ్కి గురైంది. రామ్ చరణ్ విషయంలోనూ ట్రోలింగ్ జరిగినా, ఎన్టీయార్ విషయంలో ఇంకాస్త ఎక్కువ ట్రోలింగ్ జరిగింది.
కౌంటర్ ఎటాక్..
దీంతో, ఈ ట్రోలింగ్ వ్యవహారంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీయార్ మాట్లాడాడు.. అదీ పరోక్షంగా. ప్రాంతాన్ని బట్టి యాక్సెంట్ మారుతుందనీ.. నటనలో తేడాలుండవనీ ఎన్టీయార్ చెప్పుకొచ్చాడు.
Also Read: మహేష్‌బాబు ఈజ్ బ్యాక్.! ఈసారి నెక్స్ట్ లెవల్.!
అది అర్థం కాని వాళ్ళతోనే అసలు సమస్య అని ఎన్టీయార్ వ్యాఖ్యానించాడు. సో, నర్మగర్భంగానే ట్రోలింగ్ చేసేవాళ్ళకి ఎన్టీయార్ గడ్డి పెట్టాడన్నమాట.