Ys Jagan Assembly Uninterested Politics.. పార్టీకి చెందిన ముఖ్య నేతల ఇళ్ళల్లో శుభకార్యాలు జరిగితే, పార్టీ అధినేత ఆయా ఫంక్షన్లకు హాజరవడంలో వింతేమీ లేదు.
కానీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనను ఎమ్మెల్యేగా గెలిపించిన పులివెందుల నియోజకవర్గ ప్రజల గురించి, అసెంబ్లీలో మాట్లాడాల్సి వున్నా, అసెంబ్లీకి వెళ్ళడంలేదు.
మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్, అధికారం కోల్పోయాక అసెంబ్లీకి మొహం చూపించడానికీ ఇష్టపడటంలేదు.
కానీ, ఎన్నాళ్ళిలా.? 2029 ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీ అధికారంలోకి రాకపోతే, అప్పుడూ అసెంబ్లీకి వెళ్ళకుండానే వుంటారా జగన్.? అన్న చర్చ అంతటా జరుగుతోంది.
Ys Jagan Assembly Uninterested Politics.. అసెంబ్లీని కాదని.. ఈ పబ్లిసిటీ స్టంట్లు ఏంటి.?
చిత్రంగా, వైసీపీ నేతల ఇళ్ళల్లోని శుభకార్యాలకు మాత్రం వైఎస్ జగన్ హాజరవుతున్నారు. ఈ తరహా ఫంక్షన్లకు వెళ్ళేందుకూ జన సమీకరణ చేస్తుండడం, హాస్యాస్పదంగా మారుతోంది.
వైఎస్ జగన్ పద్ధతి చూస్తోంటే, అసెంబ్లీకే కాదు.. రాజకీయాలకే దూరమయ్యేలా కనిపిస్తోందన్న చర్చ వైసీపీ శ్రేణుల్లోనూ జరుగుతుండడం గమనార్హం.
వాస్తవానికి వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు శాసన మండలి సమావేశాలకు హాజరవుతున్నారు. కాస్త గట్టిగానే అధికార పార్టీని వైసీపీ శాసన మండలి సభ్యులు కొందరు ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు.
మరి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు.? రాజకీయాలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆసక్తి తగ్గిపోయిందా.? ప్రజల్లో ఇదే చర్చ జరుగుతోంది.
‘అసెంబ్లీకి వెళ్ళని జగన్, రాజకీయాలకు అనర్హుడు..’ అనే అభిప్రాయం ప్రజల్లో మరింత బలపడితే, వైసీపీకి రాజకీయ భవిష్యత్తు వుండదు.
గెలుపోటములు సహజమేగానీ..
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఓటమిని హుందాగా అంగీకరించాలి.. పోరాట పటిమతో ముందడుగు వేయాలి. అంతేగానీ, ఓడితే, రాష్ట్రానికి దూరంగా వుండాలన్న ఆలోచన ఏమిటో.?
బెంగళూరు నుంచి అడపా దడప రాష్ట్రానికి రావడం, నచ్చితే ప్రెస్ మీట్లు పెట్టడం.. లేదంటే, కేవలం పెళ్ళి వేడుకలు, పరామర్శల కోసం రాష్ట్రానికి రావడం.. ఇదంతా పరమ బోరింగ్ వ్యవహారమైపోయింది.
Also Read: ఈయనా మనోడే.! అంటే, అమెరికా అంతా మనదే……..నా.?
కళ్ళు మూసుకుంటే ఏళ్ళు గడిచిపోతాయ్.. ఆ తర్వాత మనమే అధికారంలోకి వస్తాం.. అని వైఎస్ జగన్, పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలకు ఉద్బోధ చేస్తున్నారు.
బెంగళూరులో హాయిగా జగన్ నిద్రపోగలరేమో.. కానీ, ఇక్కడి వైసీపీ నాయకులు, కార్యకర్తలకు అలా కుదరదు కదా.! గ్రౌండ్ లెవల్‌లో పని చేయాలి.!
