Ys Jagan Chandrababu Age యాభయ్యేళ్ళ వయసున్న ఓ రాజకీయ నాయకుడు ఏడు పదుల వయసు దాటిన వ్యక్తిని ఉద్దేశించి ‘ముసలాయన’ అంటున్నారు.!
అందులో తప్పేముంది.? ముసలాయన్ని ముసలాయన అనక.. పడుచాయన అంటారా.?
మరి, యాభయ్యేళ్ళ వయసున్న వ్యక్తిని ఏమనాలి.? పాతికేళ్ళ కుర్రాడి దృష్టిలో యాభయ్యేళ్ళ వయసున్న వ్యక్తి కూడా ముసలాయనే.!
ఏడుపదుల వయసున్న చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి అమరావతి అనే రాజధాని పేరు ఖరారైంది. తాత్కాలికమో.. ఇంకొకటో, అక్కడ రాజధాని పేరుతో కొన్ని నిర్మాణాలైతే జరిగాయ్.!
Mudra369
ఐదు పదుల వయసున్న వైఎస్ జగన్ హయాంలో రాజధాని పేరుతో ఏం జరిగింది.. మూడు ముక్కలాట తప్ప.?
ఆ ఏడు పదుల వయసున్న చంద్రబాబు హయాంలోనూ పోలవరం ప్రాజెక్టు పూర్తవలేదు.. ఈ ఐదు పదుల వయసున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలోనూ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడంలేదు.!
వీళ్ళ వయసు వల్ల రాష్ట్రానికి ఏంటి లాభం.?
ఛత్.! అలా ఎలా కుదురుతుంది.? ఈ యాభయ్యేళ్ళ పొలిటీషియన్.. యంగ్ అండ్ డైనమిక్.! ఆ ఏడు పదులు దాటిన పొలిటీషియన్ మాత్రం రాజకీయ కురువృద్ధుడు.!
Ys Jagan Chandrababu Age రాజకీయ ముసలితనం..
రాజకీయాల్లో ముసలితనం.. అంటే, అనుభవం అని అర్థం.! అమెరికా అధ్యక్షుడి వయసెంత.? అంతెందుకు, మన ప్రధాన మంత్రి వయసెంత.?
విమర్శలు హద్దులు దాటేస్తున్నాయ్.! తన తండ్రి వయసున్న వ్యక్తిని పట్టుకుని.. ‘ముసలాయన’ అని ఆ యాభయ్యేళ్ళ వయసున్న పొలిటీషియన్ ఎలా అనగలిగారు.?
అంటారు.! ఇది రాజకీయం.! ఈయన, ఆయన్ని ‘దొంగ’ అన్నారు కదా గతంలో. అదీ అసలు సంగతి.
ఈయనా.. ఆయనా..
ఇక్కడ ఈయనేమో చంద్రబాబు.. ఆయనేమో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! చంద్రబాబు వయసు ఏడు పదులు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వయసు ఐదు పదులు.!
ఎవరికి ఎంత వయసొచ్చిందో జనానికి బాగా తెలుసు.! జనాలకి ఎవరి వయసెంత.? అన్నది అసలు సమస్యే కాదు.! రాష్ట్రానికి కావాల్సింది అభివృద్ధి.
Also Read: పవన్ సాక్షిగా.! బాలయ్య నోట బండ్ల మంత్రం.!
అది మానేసి, ఈ ముసలితనం.. పడుచుతనం గోలేంటి.? నిలదీసేవాడు లేకనా.?
ఎనిమిది పదుల వయసులోనూ ఉప్పొంగే యువోత్సాహం వుండొచ్చు.. రెండు పదుల వయసులోనూ కాలు కదపలేనంత బద్ధకాన్ని ప్రదర్శించేవాళ్ళనేమనాలి.? జస్ట్ థింక్ వన్స్.!
– Sindhu