Ys Jagan Daughters Politics.. నట వారసత్వం, రాజకీయ వారసత్వం.. అసలు వారసత్వమంటూ లేనిదెక్కడ.? కాకపోతే, వారసత్వ రాజకీయాలనే విమర్శ తరచూ వింటుంటాం.
నిజమే, డాక్టర్ తనయుడు వైద్య వృత్తిపై ఆసక్తి పెంచుకోవడంలో వింతేమీ లేదు. అలానే, పోలీస్ కుమార్తె కూడా ఖాకీ యూనిఫామ్ ధరించాలని అనుకోవచ్చు.
అలానే, సినిమాలైనా.. రాజకీయాలైనా.! వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు కదా.?
నారా చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ కూడా రాజకీయాల్లోనే వున్నారు కదా.! స్వర్గీయ ఎన్టీయార్ కుమార్తె పురంధరీశ్వరి రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
ఎన్టీయార్ కుమారుల్లో హరికృష్ణ రాజకీయాల్లోకి రావడం తెలిసిన సంగతే. ఇంకో కుమారుడు బాలకృష్ణ ప్రస్తుతం టీడీపీ నుంచి హిందూపూర్ ఎమ్మెల్యేగా వున్నారు.
Ys Jagan Daughters Politics.. జగన్ వారసులు వర్సెస్ షర్మిల వారసులు..?
ఇప్పుడిదంతా ఎందుకంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుమార్తెలు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది గనుక.
ఈ విషయం వైసీపీ రాజకీయ ప్రత్యర్థులెవరైనా చెబితే, ఏమో.. నిజం కాకపోవచ్చేమో.. అన్న అనుమానం కలగొచ్చు. కానీ, వైసీపీ అను‘కుల’ మీడియానే చెబితే.?
దాన్ని వైసీపీ ‘లీకు’గానే చూడాలి. లేదా, వైసీపీ నుంచి బయటకు వచ్చిన ‘పెయిడ్ న్యూస్’గానే చూడాలి. ఇదోరకం ప్రమోషనల్ స్ట్రేటజీ.!
2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత, 2029 ఎన్నికల కోసం వైసీపీ తరఫున ఎలాంటి గేమ్ ప్లాన్ అమలు చేయాలన్న విషయమై వైఎస్ జగన్ బెంగళూరులో మల్లగుల్లాలు పడుతున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం కుమార్తెల్ని చూసేందుకు వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతి.. విదేశాలకు వెళ్ళారు. కుమార్తెలిద్దరూ యూకేలోనే వున్నారు.
Also Read: ఆ ‘కక్కుర్తి’ పడకుండా తీసిన సినిమా.!
వారిలో ఒకరు లేదా, ఇద్దరూ.. త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారన్నది వైసీపీ అను‘కుల’ మీడియా ఉవాచ.! పైగా, కడప ఎంపీ సీటుని తన కుమార్తెకు ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారనేది ఆ వార్త సారాంశం.
మరి, ప్రస్తుత కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటి.? ఇది మళ్ళీ మిలియన్ డాలర్ క్వశ్చన్. అవినాష్ రెడ్డి అంటే, తమ్ముడు మాత్రమే కాదు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అంతకు మించి.
ఇంకోపక్క, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కూడా, తన వారసుల్ని రాజకీయ రంగంలోకి దించుతున్నారు. తన కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని షర్మిల ఇటీవలే ప్రకటించేశారు కూడా.
అంతేనా.? వైఎస్ షర్మిల కుమార్తె కూడా రాజకీయాల్లోకి వస్తారా.? జగన్ ఇంటి నుంచి ఇద్దరు, షర్మిల ఇంటి నుంచి ఇద్దరు వారసులు రాజకీయాల్లోకి వస్తే.. పరస్పరం తలపడితే.?
ఇవన్నీ ప్రస్తుతానికి స్పెక్యులేషన్స్ మాత్రమే. అదే సమయంలో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఏమో, గుర్రం ఎగరావచ్చు.!
