Table of Contents
Ys Jagan Janamloki.. 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత, వైఎస్ జగన్ ఎన్ని రోజుల పాటు ఆంధ్ర ప్రదేశ్‌లో వున్నారు.? అన్న ప్రశ్నకి సమాధానం వేళ్ళ మీద లెక్కబెట్టి చెప్పొచ్చు.
ఎక్కువ రోజులు వైఎస్ జగన్ బెంగళూరులోనే వుంటున్నారు. అప్పుడప్పుడూ, వారాంతాల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నారు.
వివిధ కేసుల్లో ఇరుక్కుని జైళ్ళలో రిమాండ్ ఖైదీలుగా వుంటోన్న వైసీపీ నేతల్ని కలవడానికో, లేదంటే.. పెళ్ళిళ్ళకు పేరంటాలకో.. ఇవేవీ కాకపోతే, చావు పరామర్శలకో మాత్రమే జగన్ వస్తున్నారు ఏపీకి.
Ys Jagan Janamloki.. జనంలోకి జగన్.. జోష్ వస్తుందా.?
ఇకపై, బెంగ తీరినట్లే.. వైఎస్ జగన్, జనంలోకి వస్తున్నారు.. అంటూ వైసీపీ అను‘కుల’ మీడియా ఓ ప్రచారానికి తెరలేపింది.
దాంతో, వైసీపీకి ‘బెంగ’ తీరినట్లే.. అని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే, ఈ విషయమై వైసీపీ అధినాయకత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఇంకొన్నాళ్ళు వైఎస్ జగన్, బెంగళూరుకే పరిమితం కానున్నారు. ఏపీకి సంబంధించినంతవరకు వీకెండ్ రాజకీయాలు కొనసాగిస్తారాయన.
అప్పట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిందేంటి.?
వైసీపీ హయాంలో.. కొంత కాలం కరోనా పాండమిక్‌ని చూశాం. లాక్ డౌన్లు, ఆంక్షలు.. ఇదంతా పెద్ద కథ.!
పైగా, దారుణ ఓటమి తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు, వయసు రీత్యా కొంత ఆందోళనకు గురయ్యారు.. దాన్నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది.
పవన్ కళ్యాణ్ పరిస్థితి వేరు. జనసేనాని పవన్ కళ్యాణ్, సినీ నటుడు కూడా. 2019 ఎన్నికలకు ముందు ఒప్పుకున్న సినిమాల్ని ఆయన పూర్తి చేయాల్సి వచ్చింది.
సో, హైద్రాబాద్‌లో ఎక్కువ రోజులు పవన్ కళ్యాణ్ అప్పట్లో వుండటానికి తగిన కారణం.. అదీ, బలమైన కారణం వుంది.
వైఎస్ జగన్ సంగతి ఇదీ..
వైఎస్ జగన్, వైసీపీ పరి భాషలో చెప్పాలంటే.. యువకుడు, డైనమిక్ లీడర్ కూడా. పోరాట పటిమ వున్న నాయకుడు. అలాంటప్పుడు, జనంలోనే కదా వుండాలి.?
ప్చ్.. అసెంబ్లీకి వెళ్ళడానికే వైఎస్ జగన్ భయపడుతున్న పరిస్థితిని చూస్తున్నాం. ఏపీలో వుంటే, జనంలోకి నిత్యం వెళ్ళాలి.. అంత ఓపిక వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేదాయె.
అద్గదీ అసలు సంగతి.! కానీ, నాయకుడంటే.. జనంలోనే వుండాలి. అలా జనంలో వుంటే, జగన్ ప్రతిపక్ష నేతగా చెలామణీ అవుతారు.. కూటమి ప్రభుత్వం, ఆయనకు ఆ గుర్తింపు ఇవ్వకపోయినా.
Also Read: జై చిరంజీవ.! నీ నామ జపమే వాళ్ళకి బతుకుదెరువు.!
నిజానికి, ఎంత గొప్ప ప్రభుత్వంలో అయినా, ప్రజా సమస్యలుంటాయ్.. వాటిపై ప్రజల తరఫున ఏ నాయకుడు పోరాడినా, రాజకీయంగా అది ఆ నాయకుడికి బలమవుతుంది.
కానీ, ఇదంతా అర్థమయ్యేలా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెప్పగలిగే వ్యక్తులు వైసీపీలో లేరు. అదే అసలు సమస్య.! సో, వైఎస్ జగన్ వీకెండ్ రాజకీయాలు.. ఇంకొన్నాళ్ళు కొనసాగుతాయ్.
జనంలోకి జగన్.. అనే మాట కోసం వైసీపీ శ్రేణులు ఇంకొంత కాలం వేచి చూడక తప్పదు.
