Ys Jagan Political Stone.. అనగనగా ఓ రాయి.! అది నేరుగా, ముఖ్యమంత్రి మీదకు దూసుకెళ్ళి ఆయన్ని గాయపరిచింది.! ఇంతకీ, ఈ రాజకీయ గాయానికి కారణమెవరు.?
దెబ్బ ఎవరికి తగిలినా నొప్పి కామన్.! కావాలని ఎవరైనా తమ మీద దాడి చేయించుకుంటారా.? ఎన్ని సినిమాలు చూడ్లేదు.? కొందరు చేయించుకుంటారు.!
కానీ, అన్ని సంఘటనల్నీ అలా చూడలేం కదా.? రాజకీయాల్లో వ్యూహ ప్రతి వ్యూహాలుంటాయ్.! సింపతీ గేమ్స్ కూడా అందులో భాగమే.!
Ys Jagan Political Stone.. అప్పుడు కోడి కత్తి..
2019 ఎన్నికలకు ముందు కోడి కత్తి ప్రతిపక్ష నేతకు గుచ్చుకుంది. ఆయనే ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో వున్నారు.. ఇప్పుడా ముఖ్యమంత్రి మీదకు దూసుకెళ్ళిన రాయి, గాయాన్ని చేసింది.
కోడి కత్తి వల్ల అయిన రాష్ట్ర రాజకీయాలకు అయిన పొలిటికల్ గాయం ఇంకా మానలేదు.! ఇంతలోనే, రాష్ట్రానికి ఈ ‘రాయి’ ఓ పెద్ద గాయం చేసింది.
ప్రజా స్వామ్యంలో హింసకు తావు లేదు. భౌతిక దాడుల్ని ఎవరూ సమర్థించకూడదు.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ఈ దాడిని ఖండించాల్సిందే.!
అదే సమయంలో, ప్రజలకు వాస్తవాలు తెలియాలి. దర్యాప్తు సంస్థలు నిష్పాక్షిక దర్యాప్తు చేయాలి. న్యాయస్థానాలు దోషులకు శిక్ష విధించి తీరాలి.
అన్నిటికీ మించి, ఇలాంటి ఘటనల్ని తమ రాజకీయ అవసరాలకు ఎవరూ వాడుకోకూడదు.
Mudra369
అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ రచ్చ షురూ అయ్యింది. పబ్లిసిటీ స్టంట్ అని విపక్షాలు.. విపక్షాల కుట్ర అని అధికార పార్టీ.. ఈ పంచాయితీ ఇప్పట్లో తెగదు.
జాతీయ దర్యాప్తు సంస్థ చేతులెత్తేస్తే..
కోడి కత్తి ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ ఏమీ తేల్చలేకపోయింది. ఇప్పుడీ ‘రాయి’ ఘటనపై అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ దేన్నయినా తీసుకొచ్చి విచారణకు నియమించాలేమో.!
ప్చ్.. ఏం చేసినా, ఇంకో ఐదేళ్ళలో ఈ ‘రాయి’ రాజకీయాన్ని ఛేదించడం ఎవరి తరమూ కాకపోవచ్చు. అక్కడ ఉదాహరణగా కోడి కత్తి ఘటన కనిపిస్తోంది కదా.?
Also Read: నీలి పాత్రికేయం: అమ్మకానికి.. ‘గే’ట్ వెబ్ సైట్.!
ఈలోగా రాజకీయ బురద అయితే నిర్లజ్జగా అటు రాజకీయాల్లోనూ, ఇటు మీడియాలోనూ చక్కర్లు కొడుతూనే వుంటుంది.
నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? రాష్ట్రంలో రాజకీయం ఎలా దిగజారిపోయిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.! ఇంకోసారి జనం వెర్రి వెంగళప్పలయ్యేందుకు సిద్ధమేనా.?