Ys Jagan Pressmeet Comedy.. మళ్ళీ వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టారు.! ‘జాకీలు’ అంటూ సెటైర్లేశారు.! ప్చ్.. మరోమారు సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు.!
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోయాక, ఎక్కువగా బెంగళూరులోనే వుంటోన్న సంగతి తెలిసిందే.
అప్పుడప్పుడూ రాష్ట్రానికి వస్తున్న వైఎస్ జగన్, చాలా అరుదుగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. పులివెందుల ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీకి వెళ్ళాల్సింది పోయి, ప్రెస్ మీట్లతో సరిపెడుతున్నారాయన.
వైఎస్ జగన్ తాజాగా పెట్టిన ప్రెస్ మీట్లో, కూటమి ప్రభుత్వంపై షరామామూలుగానే విమర్శలు చేశారు.
వైసీపీ హయాంలో జరిగిన అప్పుల కంటే, కూటమి హయాంలో ఎక్కువ అప్పులు చేశారంటూ మండిపడ్డారు.
Ys Jagan Pressmeet Comedy.. అప్పులు.. వడ్డీలు.. అసలు..
ఐదేళ్ళలో వైసీపీ చేసిన అప్పులు మూడున్నర లక్షల కోట్లయితే, ఏడాదిన్నరలోనే కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరలో మూడున్నర లక్షల కోట్ల అప్పులు చేసిందన్ని వైఎస్ జగన్ ఆరోపణ. ఇక్కడ జగన్ ఓ లాజిక్ మిస్ అవుతున్నారు.
వైసీపీ హయాంలో చేసిన అప్పులకి అసలు, వడ్డీ చెల్లించాలి కదా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయం అంతంతమాత్రమే కాబట్టి, గత అప్పులకు వడ్డీలు కట్టడానికి కూడా అప్పులు చేయాల్సిన దుస్థితి.
ప్రెస్ మీట్లు పెట్టి దొరికిపోవడం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కొత్తేమీ కాదు.
ఆ సంగతి పక్కన పెడితే, నారా లోకేష్‌కి చంద్రబాబు జాకీలు వేస్తోంటే, చంద్రబాబుకి లోకేష్ జాకీలు వేస్తున్నారనీ, ఇద్దరికీ పవన్ కళ్యాణ్ జాకీలేస్తున్నారని జగన్ సెటైర్లు వేసేశారు.
జగన్ జాకీల సెటైర్, వైసీపీ మీదకే బూమరాంగ్ అవుతోంది.
బెంగళూరులో కాకుండా ఏపీకి వెళితే, జగన్‌కి వాస్తవాలు తెలుస్తాయనీ, ఓడిపోయాక రాష్ట్రం నుంచి పారిపోయిన వైఎస్ జగన్, ప్రెస్ మీట్లు పెట్టుకుని తనకు తానే జాకీలు వేసుకుంటున్నారని కూటమి వైపు నుంచి కౌంటర్ ఎటాక్ వస్తోంది.
రాజకీయాలన్నాక విమర్శలు సహజమే.. వైఎస్ జగన్ విమర్శిస్తారు.. దానికి కౌంటర్ ఎటాక్ కూడా వస్తుంటుంది.
