Ys Jagan Religion.. సీనియర్ జర్నలిస్ట్ ఆర్ణబ్ గోస్వామి, ఓ చర్చా కార్యక్రమం సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిథికి ఓ ప్రశ్న సంధించడం సంచలనంగా మారింది.
అది కూడా, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ మతస్తుడు.? అన్న కోణంలో ఆర్ణబ్ గోస్వామి ప్రశ్నించడంతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు షాక్‌కి గురయ్యాయి.
తాను, తన భర్త, తన కుమారుడు.. క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నట్లు గతంలో వైఎస్ విజయలక్ష్మి చెప్పుకొచ్చారు. ఆమె గతంలో పులివెందుల ఎమ్మెల్యేగా పని చేసిన సంగతి తెలిసిందే.
విశాఖ నుంచి లోక్ సభకు వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయాక, వైసీపీ నుంచి ఆమెను దూరంగా నెట్టేశారు. అది మళ్ళీ వేరే చర్చ.
Ys Jagan Religion.. క్రైస్తవమా.? హిందుత్వమా.?
వైఎస్ జగన్ క్రైస్తవుడని వైసీపీ నాయకులు చాలామంది చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు. వైఎస్ జగన్ క్రైస్తవాన్ని అనుసరిస్తున్న మాట వాస్తవం.
చాలా సందర్భాల్లో వైఎస్ జగన్ ఏ మతస్తుడన్న ప్రశ్న తెరపైకి వస్తూనే వుంది. వైఎస్ జగన్, ఆ ప్రశ్నకు సమాధానం దాటవేయడమూ తెలిసిన విషయమే.
ఇక, ఇప్పుడు తప్పేలా లేదు. వైఎస్ జగన్, తాను ఏ మతస్తుడినన్న విషయమై స్పష్టత ఇవ్వాల్సిన సందర్భమిది.
నేషనల్ మీడియా నుంచి ఆర్ణబ్ గోస్వామి లాంటి సీనియర్ జర్నలిస్టులు సంధించే ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానం చెప్పాల్సిందే కదా.!
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మహా ప్రసాదం ‘లడ్డూ’ కోసం వినియోగించిన నెయ్యి కల్తీదనీ, నకిలీదనీ.. అదంతా వైసీపీ హయాంలో జరిగిన మహాపచారమనీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: కల్తీ నెయ్యి.! గొడ్డలితో నరకలేదు.. కత్తితో గొంతు కోశారు.!
ఈ క్రమంలో వైఎస్ జగన్, ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నారు. తాను క్రైస్తవుడినని వైఎస్ జగన్ చెప్పుకోవడంలో తప్పేమీ లేదు. పోనీ, తాను హిందువునే.. అనయినా వైఎస్ జగన్ చెప్పుకోవచ్చు.
కానీ, ఏదో ఒకటి చెప్పి తీరాల్సిందే. గతంలో తన మతం మానవత్వం.. అని మీడియా ముందు బుకాయించినట్లు.. ఇకపైనా, అదే గోడ మీద పిల్లి వాటం ప్రదర్శిస్తే కుదరదు.!
పేరు చివర్న ‘రెడ్డి’ అని గర్వంగా పెట్టుకుంటున్న వైఎస్ జగన్, మత ప్రస్తావన వస్తే, సమాధానం చెప్పకుండా మొహం చాటేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?
