Ys Jagan Resignation.. అసెంబ్లీకి వైఎస్ జగన్ వెళ్లడం లేదు. దాంతో, వైసీపీకి చెందిన మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నారు.!
ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రతి పక్ష హోదా వచ్చే అవకాశమూ కనిపించడం లేదు. సో, రాజీనామా ఒక్కటే వైఎస్ జగన్ ముందున్న ఆప్షన్ అయిపోయిందిప్పుడు.
‘ఎమ్మెల్యేగా గెలిచి కూడా అసెంబ్లీకి వెళ్ళనప్పుడు, శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చెయ్యాల్సిందే’ అన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.
‘ఆ పదవి ఎందుకు జగనన్నా, రాజీనామా చేసెయ్..’ అంటూ వైసీపీ కార్యకర్తలే, సోషల్ మీడియా వేదికగా, తమ అధినేతకు సూచిస్తున్న పరిస్థితి.
Ys Jagan Resignation.. రాజీనామా.. వాళ్ళూ.. వీళ్ళూ.!
ఈ క్రమంలో, రాజీనామా దిశగా వైఎస్ జగన్, పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
మొత్తం పదకొండు మంది ఎమ్మెల్యేలతోపాటు, ఎమ్మెల్సీలు, లోక్ సభ సభ్యులు, రాజ్య సభ సభ్యులు కూడా రాజీనామా చేస్తారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే, ఈ విషయమై వైసీపీలో ఎవరూ పెదవి విప్పడంలేదు. అంతా గప్ చిప్.! అధినేత మనసులో ఏముందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి.
అదే సమయంలో, ప్రత్యేక హోదా లాంటి బలమైన కారణం ఏదన్నా దొరికితే, రాజీనామా చేయడమే మంచిదన్నది ఆఫ్ ది రికార్డ్‌గా కొందరు వైసీపీ నేతల వాదన అట.
వైఎస్ జగన్ వ్యూహమేమిటో.?
టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని కూటమి బలంగా వున్న దరిమిలా, ఒకవేళ వైసీపీ గనుక రాజీనామాస్త్రాన్ని తెరపైకి తెస్తే, వైఎస్ జగన్, రాజకీయంగా మరింత ఇబ్బంది పడక తప్పదు.
అన్నట్టు, ప్రతి పక్ష హోదా ఇవ్వకపోయినా, సభలో మైక్ తగినంత సమయం ఇస్తే, అసెంబ్లీకి వెళ్తానని జగన్ తాజాగా, వైసీపీ నేతల వద్ద ప్రస్తావించారన్నది నిజమేనా.?
Also Read: వృక్ష రాజం.. కళాకృతిగా మారిన వైనం.! ఇదో అద్భుతం.!
అదే నిజమైతే, అసెంబ్లీకి వెళ్ళి.. అక్కడ ఎటూ తనకు సమయం దక్కదు గనుక, ఆ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగానే ప్రస్తావించి, ఆ తర్వాత రాజీనామాస్త్రాల్ని జగన్ ప్రయోగించొచ్చు.
ఇంకోపక్క, అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే, శాసన సభ సభ్యత్వాలు రద్దవుతాయంటూ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.
