Ys Sharmila Andhra Politics.. వైఎస్ షర్మిల రాజకీయం తెలంగాణలో ముగిసింది. ఇప్పుడామె రాజకీయం, ఆంధ్ర ప్రదేశ్‌లో మొదలైంది.! కాదు కాదు, మళ్ళీ మొదలైంది.!
మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల, గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.
కొన్నాళ్ళపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ బాధ్యతలూ చేపట్టారు. ఏమయ్యిందోగానీ, తెలంగాణలో వైఎస్సార్సీపీ జెండా ఎత్తేయడంతో, ఏపీ రాజకీయాలకే పరిమితమైన షర్మిల, 2019 ఎన్నికల తర్వాత అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాజకీయంగా దూరమయ్యారు.
తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెట్టి, ఆ పార్టీని ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు వైఎస్ షర్మిల.
Ys Sharmila Andhra Politics.. వైఎస్ షర్మిల ఆంధ్రా రాజకీయం.!
ఇక, ఇప్పుడామె కాంగ్రెస్ నేత. తాజాగా ఆమెకు ఏపీ కాంగ్రెస్ పగ్గాల్ని అప్పగించింది కాంగ్రెస్ అధినాయకత్వం. అంటే, 2024 ఎన్నికల్లో నేరుగా అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో రాజకీయంగా షర్మిల తలపడబోతున్నారన్నమాట.
ఇంతకీ, రాజన్న వారసత్వం ఎవరి సొంతం.? కుమారుడికా.? కుమార్తెకా.? ఆ సంగతి ముందు ముందు తేలుతుంది.
అయితే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకూడదని తెలంగాణలో ఆలోచించిన వైఎస్ షర్మిల, ఆ వ్యతిరేక ఓటు చీల్చేందుకు ఏపీ రాజకీయాల్లోకి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎంటరయ్యారన్న విమర్శలు లేకపోలేదు.
ప్రత్యేక హోదా గురించి షర్మిల ఎలా నినదిస్తారు.? సోదరుడు వైఎస్ జగన్ పాలనపై ఎలాంటి విమర్శనాస్త్రాలు ఆమె సంధిస్తారు.? అన్నది వేచి చూడాల్సిందే.
విజయమ్మ పరిస్థితి ఏంటబ్బా.?
ఇంతకీ, వైఎస్ విజయమ్మ ఎటు వైపు.? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తొలగించిన కుమారుడు వైఎస్ జగన్ వెంట ఆమె విధిలేని పరిస్థితుల్లో కొనసాగుతారా.?
Also Read: Malaika Arora: ఆమె ముందు వయసు ఓడిపోయింది.!
లేదంటే, కుమార్తె కోసం తెలంగాణ రాజకీయాల్లో అనవసర హడావిడి చేసి, నానా రకాల విమర్శలూ ఎదుర్కొన్న విజయమ్మ.. ఆ కుమార్తె వెంట, కాంగ్రెస్ పార్టీలో చేరి, తనయుడికి వ్యతిరేకంగా నిలబడతారా.?
రానున్న రోజుల్లో ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయేమో.!