Ys Sharmila Dumps YSRTP పాదయాత్ర అంటే ఏంటో తెలుసా.? పాదాల మీద నడిచే యాత్ర.! ఈ డైలాగ్‌తో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఎంత పాపులర్ అయ్యారో తెలుసు కదా.!
‘జగనన్న వదిలిన బాణాన్ని’ అంటూ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల, అన్నకు దూరంగా ఎందుకు జరిగారన్నది ఇప్పటికీ మిస్టరీనే.!
తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకున్నారు.. అదే వైఎస్సార్ తెలంగాణ పార్టీ.! సుదీర్ఘ పాదయాత్రని తెలంగాణలోనూ వైఎస్ షర్మిల చేశారు.
Ys Sharmila Dumps YSRTP.. ఆ రికార్డు వైఎస్ షర్మిల సొంతం..
ఓ మహిళ దేశ రాజకీయాల్లో ఇంతటి సుదీర్ఘ పాదయాత్ర చేయడం ఇదే ప్రథమం. వైఎస్ షర్మిల అలాంటి పాదయాత్రల్ని రెండు సార్లు చేసేశారు.
ప్చ్.. ఏం లాభం.? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బలం సరిపోక, చేతులెత్తేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే, జెండా దించేశారు.! జెండా పీకేశారనీ అనుకోవచ్చు.!

సరే, రాజకీయాల్లో ఒక్కోసారి వ్యూహాలు మారుతుంటాయ్. అది వేరే చర్చ. కనీసం, ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటనైనా షర్మిల నిలబెట్టుకుని వుండాల్సింది.
కేవలం పాదయాత్ర మాత్రమే కాదు, వైఎస్ షర్మిల తెలంగాణలో చాలా చేశారు. నిరుద్యోగ దీక్షలు చేశారు.. అరెస్టుల్ని ఎదుర్కొన్నారు.. అబ్బో, చాలా నడిచింది వ్యవహారం.
పొంగులేటి వెనుక జగన్ హస్తం.?
ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తుండడంతో, ఆయన గెలుపుకి సహకరిస్తానంటున్నారు వైఎస్ షర్మిల.
అదే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్‌కి గుడ్ బై చెప్పి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత, మర్యాదపూర్వకంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు.
ఫలితంగా, తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని వైఎస్ షర్మిల నుంచి ప్రకటన వచ్చింది. ఈ మాత్రందానికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఎందుకు.? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం ద్వారానే వైఎస్ షర్మిల రాజకీయం చేయొచ్చుగా.!
Also Read: స్నాక్స్ అండ్ గా‘చిప్స్’.! ఇక మొదలెడదామా.?
ఏమో, ఆ అవకాశం వైఎస్ జగన్, కేసీయార్ మీద గౌరవంతో తన సోదరి వైఎస్ షర్మిలకు ఇవ్వలేదేమో.! పార్టీ ఎందుకు షర్మిల పెట్టినట్టు.? ఇప్పుడెందుకు జెండా దించేసినట్టు.?
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో మద్దతిస్తున్నట్లు ప్రకటించిన వైఎస్ షర్మిల, ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తారా.? ఇస్తే, ఆ మద్దతు వెనుక వైఎస్ జగన్ వున్నట్టేనా.? అంతేనేమో.!