Ys Sharmila Raja Reddy.. త్వరలో.. అతి త్వరలో.. వైఎస్ షర్మిల తనయుడు కూడా రాజకీయాల్లోకి రాబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా వైఎస్ షర్మిల ప్రకటించారు.
ప్రస్తుతం వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అన్న వైఎస్ జగన్ కోసం గతంలో వైసీపీ తరఫున సుదీర్ఘ పాదయాత్ర చేశారు షర్మిల.
కానీ, అదే అన్న వైఎస్ జగన్ నుంచి దూరంగా జరిగి, తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. మళ్ళీ సుదీర్ఘ పాదయాత్ర చేశారు షర్మిల.. కానీ, తెలంగాణలో పార్టీని మూసెయ్యాల్సి వచ్చింది.
Ys Sharmila Raja Reddy.. వైఎస్ రాజా రెడ్డి.. రాజకీయ రంగ ప్రవేశం..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె గనుక, వైఎస్ షర్మిలా రెడ్డి. మెరుసుపల్లి అనిల్ కుమార్ సతీమణి కాబట్టి, మెరుసుపల్లి షర్మిల మాత్రమే.. ఇలా షర్మిల ఇంటి పేరు చుట్టూ రచ్చ మామూలే.
ఇప్పుడీ వైఎస్ రాజా రెడ్డి కథేంటి.? వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి పేరు రాజా రెడ్డి. అలా, షర్మిల తనయుడి పేరు వైఎస్ రాజా రెడ్డి అయ్యిందన్నమాట.
పేరులో ఏముంది.? అంటే, ఎందుకు లేదు.. వైఎస్ రాజకీయ వారసత్వం వుంది.. ఆ పేరులో.! అబ్బే, అలా ఎలా కుదురుతుంది.? అని వైసీపీ శ్రేణులు అప్పుడే, షర్మిల తనయుడ్ని ట్రోల్ చేస్తున్నారు.
రాజకీయ రంగ ప్రవేశం కాంగ్రెస్ పార్టీ నుంచేనా.?
షర్మిల తనయుడు కదా.. అంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మేనల్లుడు అవుతాడన్నమాట రాజా రెడ్డి. ఆ లెక్కన మేనమామకి, రాజా రెడ్డి నుంచి రాజకీయంగా గట్టి షాక్ తగలబోతోందన్నమాట.
కంస మామ.. అంటూ, రాజా రెడ్డి పేరుతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సోషల్ మీడియాలో కౌంటర్ ఎటాక్స్ పడుతున్నాయి.
Also Read: బిగ్ క్వశ్చన్.! మీ బిర్యానీలో ‘చికెన్’ వుందా.?
ఇదంతా విజయమ్మ డైరెక్షన్‌లోనే జరుగుతోందంటూ, వైఎస్ విజయలక్ష్మిని కూడా ట్రోల్ చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా.
కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చే ఎన్నికల్లో రాజా రెడ్డి పోటీ చేసేలా తెరవెనుక వైఎస్ షర్మిల పావులు కదుపుతున్నారన్నది తాజా ఖబర్.!
అంటే, పులివెందుల నుంచే షర్మిల తనయుడు పోటీ చేస్తాడని అనుకోవాలా.? ఈ స్పెక్యులేషన్స్ రాజకీయాల్లో మామూలేగానీ, ఇప్పుడే ఓ అంచనాకి వస్తే, అది తొందరపాటే అవుతుంది.