YSRCP And Criminal Politics.. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై క్రిమినల్ కేసులున్నాయ్.. జన సేన పార్టీ అధినేత మీద కూడా క్రిమినల్ కేసులున్నాయ్..!
ఇంతకీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంగతేంటి.? ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ‘క్రిమినల్స్’ ప్రస్తావన.. దాంతో నడుస్తున్న రాజకీయ రచ్చ వెనుక కథేంటి.?
ఔను, ఏపీ సీఎం చంద్రబాబు మీద పలు కేసులున్నాయి. ఆయన సుమారు రెండు నెలలపాటు జైల్లో వున్నారు కూడా. అది కూడా, వైఎస్ జగన్ హయాంలో.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా పదహారు నెలలపాటు జైల్లో వున్నారు.. అదీ కాంగ్రెస్ హయాంలో. చంద్రబాబు బెయిల్ మీదనే వున్నారు. వైఎస్ జగన్ కూడా సుదీర్ఘ కాలంగా బెయిల్ మీదున్నారు.
కానీ, పవన్ కళ్యాణ్ అలా కాదు కదా. వైసీపీ హయాంలో కుట్రపూరితంగా నమోదైన ‘గాలి’ కేసులు తప్ప, పవన్ కళ్యాణ్ మీద పెద్దగా కేసులేమీ లేవు.
YSRCP And Criminal Politics.. పవన్ కళ్యాణ్ మీద క్రిమినల్ రాజకీయాలు.!
పైగా, జన సేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా అరెస్టయ్యింది లేదు. ఏపీ డిప్యూటీ సీఎం మీద, ‘క్రిమినల్’ ముద్ర వేయాలన్న వైసీపీ ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయి.
వైసీపీ, సోషల్ మీడియా వేదికగా, ‘చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. క్రిమినల్స్’ అని పేర్కొంటూ తనదైన రీతిలో దుష్ప్రచారానికి తెరలేపింది.

నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్లుంటుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అసలంటూ, వైసీపీకి ఇతరుల్ని ‘క్రిమినల్స్’ అనే నైతిక హక్కు వుందా.?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీదనే లెక్కలేనని క్రిమినల్ కేసులున్నాయ్. ఏళ్ళ తరబడి ఆయా కేసుల్లో ఆయన బెయిల్ మీదున్నారు.
ఎప్పుడు బెయిల్ రద్దయితే, అప్పుడు వైఎస్ జైలుకు పోవాల్సిందే. దేశం విడిచి విదేశాలకు వెళ్ళాలన్నా కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే. ఇదీ వైఎస్ జగన్ పరిస్థితి.
బట్ట కాల్చి మొహాన వేయడం.. వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. ఈ దిక్కుమాలిన విద్యలో ప్రావీణ్యం కాస్తా, వైసీపీనే పాతాళానికి తొక్కేస్తోంది.

‘నేరమయ రాజకీయాల గురించి క్రిమినల్ పార్టీ వైసీపీ మాట్లాడితే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?’ ఇదీ, వైసీపీకి టీడీపీ, జన సేన నుంచి వచ్చే కౌంటర్ ఎటాక్.!
అవసరమా వైసీపీకి.. ఇదంతా.? వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి సహా, అప్పటి మంత్రులపై ఎన్నెన్ని క్రిమినల్ కేసులున్నాయి.? ఓసారి వైసీపీ ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది.
అవన్నీ ఎందుకు.? ఇప్పుడు వైసీపీలో వున్న నేతలపై ఎన్నెన్ని క్రిమినల్ కేసులున్నాయి.. ఓ సారి చెక్ చేసుకుంటే, వైసీపీ ఇంకెప్పుడూ క్రిమినల్ రాజకీయాల గురించి మాట్లాడదు.