YSRCP Trolling Against Janasena.. అదొక నీలి పార్టీ.! వై నాట్ 175 అని ఏడ్చే పార్టీ.! అంత ధీమాగా వున్నప్పుడు, రాజకీయ ప్రత్యర్థుల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా.!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. దాని పేరు.! 2019 ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) నుంచి ఏకంగా 151 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది వైసీపీ.
అంతటి బలమైన పార్టీ, అదే ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటు గెల్చుకున్న జనసేన పార్టీ (Jana Sena Party) మీద ఎందుకు పడి ఏడుస్తున్నట్టు.?
అధికార పక్షంపై రాజకీయ పోరాటం అనేది ఏ రాజకీయ పార్టీ అయినా చేసేదే.! రాజకీయాలన్నాక విమర్శలు సహజం.
YSRCP Trolling Against Janasena.. నిస్సిగ్గు ట్రోలింగ్.. ఏం సాధిద్దామని.?
జనసేన పార్టీని వైసీపీ విమర్శొంచొచ్చు.. అందులో తప్పేమీ లేదు కూడా.! కానీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనసేనను వైసీపీ ట్రోల్ చేయడమేంటో.!
కామెడీనే ఇది.! ఎందుకంటే, వైసీపీ అసలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections 2023) పోటీ చేయలేదు. అలాంటప్పుడు, తెలంగాణ రాజకీయాలతో వైసీపీకి సంబంధం లేదు కదా.!
పోటీ చేయకపోవడం మాత్రమే కాదు, తెలంగాణ రాజకీయాలతో తమకు సంబంధం లేదని వైసీపీనే గతంలో ప్రకటించేసుకుంది.
రాజకీయాల్లో గెలుపోటములు సహజమేగానీ..
ధైర్యంగా జనసేన పార్టీ (Jana Sena Party) ఎనిమిది సీట్లలో పోటీ చేసింది. అదీ, భారతీయ జనతా పార్టీతో కలిసి. రాజకీయాల్లో గెలుపోటములు సహజం.! ఆ విషయం, వైసీపీకే బాగా తెలుసు.
ఓడి, ఓడి.. గెలిచింది వైసీపీ.! జనసేన కూడా ముందు ముందు రాజకీయాల్లో అద్భుతమైన విజయాలు సాధించే అవకాశం లేకపోలేదు.
Also Read: ఎందుకొచ్చిన ఎగ్జిట్ పోల్.? ఎవర్ని ఏమార్చడానికి.?
కాకపోతే, జనసేన పార్టీ ఎన్నికల సమయంలో ఓట్లను కొనుగోలు చేయదు. అందుకే, జనసేన పార్టీకి విజయం కాస్త ఆలస్యమవుతుందేమోగానీ, విజయం దక్కి తీరుతుంది.
సమాజంలో మార్పు దిశగా జనసేన పార్టీ అడుగులేస్తోంది. కాలక్రమంలో జనసేన పార్టీ కూడా ఖచ్చితంగా రాజకీయం నేర్చుకుంటుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.