Home » డౌటానుమానం: ప్రధాని మోడీ రాజీనామాని కాక్రోచ్‌లు కోరట్లేదెందుకో?

డౌటానుమానం: ప్రధాని మోడీ రాజీనామాని కాక్రోచ్‌లు కోరట్లేదెందుకో?

by Mudra369 Editorial Desk
0 comments
Gyanesh Kumar

Cockroach Targets Gyanesh Kumar.. మొన్నేమో కేంద్ర మంత్రి రాజీనామా కోరుతూ అల్లరి.! ఇప్పుడేమో, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీనామా కోరుతూ అలజడి.!

ఇవన్నీ ఎందుకు.? ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజీనామాని కోరితే సరిపోతుంది కదా.? దేశంలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ముసుగులో జరుగుతున్న ఆందోళనలు, ధర్నాలు, అసాంఘీక కార్యకలాపాలు.. అన్నీ ఇన్నీ కావు.

దేశ రాజధాని ఢిల్లీని గత కొద్ది రోజులుగా రణరంగంగా మార్చేస్తున్నాయి బొద్దింకలు. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య గలాటా ఏ స్థాయిలో వుంటోందో చూస్తూనే వున్నాం.

ఆ బొద్దింకల గుంపులో చేరిపోయారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సినీ నటుడు ప్రకాష్ రాజ్, విద్యార్థి సంఘం నాయకురాలు నేహా బోరా.. ఇంకా చాలామంది.

Cockroach Targets Gyanesh Kumar.. ‘సర్’ ఓ కుంటి సాకు మాత్రమే..

‘సర్’ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయన్నది కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా కోరడానికి రీజన్ అట.

దేశవ్యాప్తంగా ‘సర్’ ప్రక్రియ నడుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో అక్రమ ఓట్లు తొలగించబడుతున్నాయి.. అసలైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందీ రాకుండా, కొత్తగా ఓటర్ల నమోదుకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ‘ఈసీ’

మరి, జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా ఎందుకు చెయ్యాలి.? ఎందుకంటే, గతంలో ‘నీట్’ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర మంత్రితో రాజీనామా చేయించారు కాబట్టి.

అప్పటి ఆందోళనలు సత్ఫలితాలను ఇచ్చిన దరిమిలా, బొద్దింకలు కొత్త డిమాండ్‌ని తెరపైకి తెచ్చాయి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చెయ్యాలని.

తర్వాత అమిత్ షా.. ఆపై ప్రధాని మోడీ.!?

తర్వాతేంటి.? కేంద్ర మంత్రి అమిత్ షా టార్గెట్‌గా ఉద్యమాలు జరుగుతాయా.? ఇవన్నీ ఎందుకు.? ప్రధాన మంత్రి రాజీనామా చేయాలంటూ ఆదోళనలు చేసెయ్యొచ్చు కదా.?

దొంగ ఓట్లు పోతున్నాయన్నది ‘సర్ ప్రకియ’ విషయమై బొద్దింకలు పడుతున్న కంగారు వెనుక అసలు కథ. అంటే, బొద్దింకల్లోనూ అక్రమ ఓటర్లున్నారు.. అని అనుకోవాలా.? అంతేనేమో.!

ఎవరి ఓటూ ఎక్కడికీ పోదని స్వయంగా ఎన్నికల కమిషన్ చెబుతోంది. కేంద్ర ప్రభుత్వనిదీ ఇదే మాట. కాకపోతే, గ్రౌండ్ లెవల్‌లో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వుంది ‘బీఎల్‌వో’ల వ్యవహార శైలిలో.

దేశానికి వ్యతిరేకంగా ‘కాక్రోచ్’ కుట్ర.!

ఓటర్లకీ, బీఎల్‌వోలకీ మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా సెట్ అవడం లేదు. ఇది సాంకేతికంగా చిన్న పొరపాటు మాత్రమే. చదువుకున్న విద్యార్థులు ఆందోళన బాటలో వున్నారు కదా, కాస్త స్థిమితంగా ఆలోచిస్తే, వాళ్ళకే విషయం అర్థమవుతుంది.

ఏదిఏమైనా, గత కొద్ది రోజులుగా బొద్దింకల అల్లరి, కేంద్ర ప్రభుత్వానికి పెను సవాల్‌గా మారుతోంది. ‘హిట్’ సరిగ్గా కొట్టకపోతే, అసాంఘీక శక్తులు పెచ్చుమీరిపోతాయ్.

ఎలాన్ మస్క్ లాంటి విదేశీ వ్యాపారవేత్తలు వెటకారాలు చేస్తున్నా.. అంతర్జాతీయ సమాజం నుంచి నీతి వాక్యాలు ఎక్కువవుతున్నా.. ఇదంతా, దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో భాగంగానే చూడాలి.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group