Home » Zayn Marie Khan.. గ్లామరస్ ‘డెకాయిట్’.. హాట్ సెన్సేషన్.!

Zayn Marie Khan.. గ్లామరస్ ‘డెకాయిట్’.. హాట్ సెన్సేషన్.!

by hellomudra
0 comments
Zayn Marie Khan

Zayn Marie Khan Dacoit.. ఎవరీ జేన్ మేరీ ఖాన్.! జేన్ మేరీ ఖాన్ అనాలా.? జేయన్ మేరీ ఖాన్ అనాలా.? ఎవరైనా ఎలాగైనా పిల్చుకోండి.. ఒకే ఒక్క సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయింది.

ఇంతకీ, ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. జస్ట్ ఓ ప్రెస్ మీట్, ఆమెను హాట్ సెన్సేషన్‌గా మార్చేసింది. అది కూడా, ఓ తెలుగు సినిమా కావడం గమనార్హం.

సినిమా పేరు ‘డెకాయిట్’. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతోంది జేన్ మేరీ ఖాన్.

Zayn Marie Khan Dacoit.. అమీర్ ఖాన్ మేనకోడలే ఈ జేన్ మేరీ ఖాన్..

అంతకు ముందు ఒకటీ అరా బాలీవుడ్ సినిమాల్లో నటించింది జేన్ మేరీ ఖాన్. కానీ, ‘డెకాయిట్’ సినిమాతోనే జేన్ మేరీ ఖాన్‌కి దేశవ్యాప్త గుర్తింపు లభిస్తోంది.

తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ ‘డెకాయిట్’ విడుదల కానున్న దరిమిలా, సినిమా ప్రమోషనల్ ఈవెంట్ ఇటీవల ముంబైలో నిర్వహిస్తే, ఆ ఈవెంట్‌లో జేన్ మేరీ ఖాన్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యింది.

ఈ తరహా ఈవెంట్ల కోసం సెలబ్రిటీలు స్పెషల్లీ డిజైన్డ్ గెటప్స్‌లో కనిపిస్తుంటారు.. ఇదేమీ కొత్త విషయం కాదు.

కాకపోతే, ఫొటోగ్రాఫర్ల కళ్ళు సైతం బైర్లు కమ్మే స్థాయిలో గ్లామర్ ఒలకబోసేయడం, అది కాస్తా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవడం.. కొత్త విషయమే.

Also Read: నాలుగు పదుల వయసులో.. కుర్చీ మడతబెడితేనే ఫిట్టు.. పెర్‌ఫెక్టు.!

చిత్రమేంటంటే, చేయాల్సిందంతా చేసేసి, అందాలన్నీ కెమెరాల ముందు ఆరబోసేసి, ‘మీరు మమ్మల్ని అలా చూపించడం సరి కాదు’ అంటూ, మీడియా కెమెరాల మీద సెలబ్రిటీలు గుస్సా అవడం.

జేన్ మేరీ ఖాన్ నుంచి ఖండన ప్రకటన ఏమీ ఇంతవరకు రాలేదుగానీ, అత్యంత జుగుప్సాకరంగా వున్నాయి ఆమె ఫొటోలు, వీడియోలు.. ‘డెకాయిట్’ ప్రమోషనల్ ఈవెంట్‌కి సంబంధించి.

ఎలాగైతేనేం, కావాల్సిన పబ్లిసిటీ అయితే జేన్ మేరీ ఖాన్‌కి వచ్చేసింది. ఇంకాస్త పబ్లిసిటీ కావాలనుకుంటే, ఆ వల్గారిటీ మీద ఆమే స్పందించి, అగ్నికి ఆజ్యం పోస్తుందన్నది నిర్వివాదాంశం.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group