మనం స్మార్ట్ ప్రపంచంలో వున్నాం. స్మార్ట్ ఫోన్లను చాలా చాలా విరివిగా వాడేస్తున్నాం. ఒకప్పటి ఇంటర్నెట్ స్పీడ్ ఎంత.? ఇప్పుడు స్పీడ్ ఎంత.? మొబైల్ ఫోన్ (5G Mobile Network Radiation Harmful Or Not) చేతిలో వుంటే.. అరచేతిలో ప్రపంచం వున్నట్టే. టెక్నాలజీ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది.. దాంతోపాటే, టెక్నాలజీపై అనుమానాలూ పెరుగుతున్నాయి.
మొబైల్ టవర్ల ద్వారా రేడియేషన్ ముప్పు క్రమక్రమంగా పెరుగుతోందన్న విమర్శలు ఎప్పటినుంచో వున్నాయి. ‘రోబో 2.0’ సినిమాలోని అసలు కాన్సెప్టే అది. ఆ సినిమాని ఎప్పుడు చూసినా, వెన్నులో ఒకింత వణుకు పుడుతుంది. అది సినిమా కాబట్టి, నిజ జీవితంలో అలాంటివి జరగవ్.. అని లైట్ తీసుకుంటారు చాలామంది.
ఇక, ఇప్పుడు 5జి టెక్నాలజీ కోసం రంగం సిద్ధమవుతోంది. కానీ, దీని చుట్టూ చాలా విమర్శలు, అనుమానాలున్నాయి. ఫైవ్ జీ టెక్నాలజీతో రేడియేషన్ ప్రభావం చాలా ఎక్కువగా వుండబోతోందన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన. మనం ఇప్పుడు అనుభవిస్తున్న కరోనా భూతానికీ అదే కారణమన్న పుకార్లు లేకపోలేదు.
కరోనా విషయంలో ఆ పుకార్లను నమ్మడానికి వీల్లేదు. కానీ, రేడియేషన్ మాత్రం వాస్తవం. అబ్బే, మనుషులకు హాని కలిగించేంత స్థాయిలో రేడియేషన్ వుండదు.. అని శాస్త్రవేత్తలు చెప్పొచ్చగాక. టెలికం సంస్థలు బుకాయించొచ్చుగాక. కానీ, రేడియేషన్ అన్నది వచ్చి తీరుతుంది.. అది స్లో పాయిజన్ తరహాలో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ప్రజల మీద ప్రభావం చూపుతోంది.
ఇంతకీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి.? ఏం చేస్తాయ్.. కరోనా విషయంలో ఏం చేశాయ్.. అంతకన్నా ఇంకేం చేయగలుగుతాయ్.? ప్రభుత్వాలకి ఆదాయమే ముఖ్యం. ఆ ఆదాయం కోసం ‘అతి ముఖ్యమైన అంశాల్ని’, చిన్న విషయాలుగా కొట్టి పారేయడం మామూలే.
స్మార్ట్ ప్రపంచంలో ఆనందంగా వున్నామనుకుంటున్నాం.. కానీ, అనేకరకాలైన సమస్యలు కొనితెచ్చుకుంటున్నాం. ఇక్కడ తప్పెవరిది.? అంటే, అందరిదీ. బాలీవుడ్ నటి జూహీ చావ్లా, 5 జీ మొబైల్ నెట్ వర్క్ (5G Mobile Network Radiation Harmful Or Not) విషయమై కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది.