Amarnath Yatra పుణ్యానికి పోతే, ఏదో ఎదురైందన్నది వెనకటికి ఓ సామెత.! ఒకప్పుడు సుదూరాన వున్న పుణ్యక్షేత్రాలకు భక్తితో వెళ్ళడం వెనుక చాలా పరమార్ధం వుండేది.
చాలా కాలం క్రితం కాశీయానం అంటే.. వెళ్ళడమే తప్ప, తిరిగొచ్చే పరిస్థితి వుండేది కాదు. కానీ, ఇప్పుడలా కాదు. పొద్దున్న విమానం ఎక్కితే, కాశీ వెళ్ళి సాయంత్రాినకి తిరిగొచ్చేసేందుకు వీలుగా ‘రవాణా సౌకర్యం’ అందుబాటులో వుంది.
పొద్దున్న ఓ దేశంలో బ్రేక్‌ఫాస్ట్ చేసి, మధ్యాహ్నం ఇంకో దేశంలో లంచ్ చేసి, సాయంత్రం మరో దేశంలో డిన్నర్ చేస్తోన్న రోజులివి.
భక్తి.. పర్యాటకం.. పైత్యం.. ఏది నిజం.?
కొన్నాళ్ళ క్రితం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అనూహ్యంగా వరదలు సంభవించాయి. చాలామంది ప్రాణాలు కోల్పోయారు.
ఆధ్మాతిక పర్యాటకం.. ఇలా ఆద్మాత్మికతనీ, పర్యాటకాన్నీ ప్రభుత్వాలు కలిపేశాక.. ఇలాంటి ‘ప్రకృతి ప్రకోపాల్ని’ సామాన్యుడు చూడక తప్పడంలేదు.
తాజాగా అమర్‌నాథ్ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో అనూహ్యంగా ముంచుకొచ్చిన వరద పలువురి ప్రాణాల్ని తీసేసింది.

నిజానికి, మంచు కొండల మాటున దాగి వుండే ముష్కరమూకలు ఎప్పుడు విరుచుకుపడతాయో తెలియని పరిస్థితుల్లో.. ప్రకృతి ప్రకోపం తాలూకు ప్రభావం పడకుండా.. అత్యంత సాహసోపేతంగా మంచు లింగాన్ని దర్శించుకుంటారు భక్తులు.
Amarnath Yatra.. వ్యాపారం.. కక్కుర్తి.. ప్రమాదం.!
అమర్‌నాథ్ యాత్ర మాటున ప్రభుత్వం ‘కక్కుర్తి’ సుస్పష్టం. భక్తుల అతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు గనుక.. ‘అతి భక్తి’, ఆధ్యాత్మిక పర్యాటకం.. ఈ పేరుతో నడుస్తున్న ‘భక్తి వ్యాపారం’ మీద ఆ పరమశివుడే కన్నెర్రజేశాడని అనుకోవాలేమో.!
Also Read: నువ్వు నాశనం చేసిన మట్టి.! నిన్ను ఇంకా బతికిస్తోంది.!
పుణ్యక్షేత్రాల సందర్శన పాపాల్ని పోగొడుతుంది.. అని పెద్దలు చెబుతుంటారు. తెలియక చేసిన పాపాల సంగతి అది. కానీ, పుణ్యక్షేత్రాలకు వెళుతున్నాం గనుక పాపాలు చేసుకుంటూ పోతే ఎలా.? అన్నది మరో వాదన.
ఆయా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు భక్తిపారవశ్యంలో మునిగి తేలాలి. ప్రకృతి అందాలకు పులకించిపోవాలి.
కానీ, ఆయా ప్రాంతాల్ని కలుషితం చేయడం, పవిత్ర పుణ్యక్షేత్రాల్లో అసాంఘీక కార్యకలాపాలు, అభ్యంతరకర ప్రవర్తన.. వెరసి, పుణ్యం చేయడానికి వెళ్ళి.. పాపాలు చేసి తిరిగొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
చివరగా.. పర్యాటకం పేరుతో పుణ్యక్షేత్రాల్లో చేసే అకృత్యాలు, ముమ్మాటికీ మహా పాపం.!