Mithali Raj Telugu.. మిథాలీ రాజ్… దేశం గర్వించదగ్గ గొప్ క్రీడాకారిణి. భారతదేశంలో మహిళా క్రికెట్‌కి తిరుగులేని గుర్తింపు తీసుకొచ్చిన ఘనత ఆమె సొంతం.
దేశం కోసం ఆమె క్రికెట్ ఆడింది. ఔను, డబ్బు కోసమో.. పాపులారిటీ కోసమో.. క్రికెట్‌ని కేవలం ఆటగా భావించే చాలామంది ప్రస్తుతం క్రికెట్‌లోకి వస్తున్నారు.
మిథాలీ రాజ్ మాత్రం.. దేశంలో క్రికెట్ పట్ల మహిళా లోకం ఆసక్తి పెంచుకోవాలనీ, ప్రపంచ క్రికెట్‌లో మహిళల ప్రాధాన్యం పెరగాలని కోరుకుంది.
తన గెలుపు.. ఎంతోమంది మహిళలకు స్ఫూర్తినివ్వాలనుకుంది మిథాలీ రాజ్. ఈ విషయంలో ఇంకో మాటకు తావు లేదు.
Mithali Raj Telugu.. ఇంతకీ, మిథాలీ రాజ్ ఏ రాష్ట్రానికి చెందినది.?
మిథాలీ రాజ్‌కి రాజస్థాన్ మూలాలున్నాయి. అదే సమయంలో ఆమెకు తమిళనాడుతోనూ లింక్ వుంది. తెలుగు నేలతో చాలా అనుబంధం వుంది మిథాలీ రాజ్‌కి.
చాలామందికి మిథాలీ రాజ్ తెలుగులో మాట్లాడుతుందని తెలుసు. ఎందుకంటే, ఆమె తెలుగు నేలపైనే విద్యను అభ్యసించింది గనుక.!

మరి, సానియా మీర్జా ఎప్పుడూ ఎందుకు తెలుగులో మాట్లాడలేదు.? వివీఎస్ లక్ష్మణ్ ఎందుకు తెలుగులో మాట్లాడేందుకు ఇబ్బంది పడతాడు.?
వాళ్ళ సంగతి పక్కన పెడితే, మిథాలీ రాజ్ (Mithali Raj) మాత్రం.. పదహారణాల తెలుగమ్మాయిలా తెలుగు మాట్లాడగలదు.
తెలుగు మాట్లాడటం అంత పెద్ద తప్పా.?
అక్కడికి, అదేదో పెద్ద ‘తప్పు’.. అన్నట్టుగా, ‘మీరు తెలుగులో కూడా మాట్లాడతారా.?’ అని ఆశ్చర్యం వ్యక్తం చేసేస్తున్నారు కొందరు మిథాలీ రాజ్ తెలుగులో మాట్లాడటంపై.
మిథాలీ రాజ్ జీవిత కథను ‘శభాష్ మిత్తు’ పేరుతో తెరకెక్కించిన విషయం విదితమే. తాప్సీ ఈ సినిమాలో మిథాలీ రాజ్ పాత్రలో కనిపించబోతోంది.
Also Read: జస్ట్ ఆస్కింగ్.! అచలుడు అనగానేమి.?
‘శభాష్ మిత్తు’ ప్రమోషన్ల కోసం హైద్రాబాద్ వచ్చిన మిథాలీ రాజ్‌ని ఓ తెలుగు న్యూస్ రీడర్, యాంకర్ ప్రశ్నించేస్తూ, ‘మీరు తెలుగులో మాట్లాడతారా.?’ అని ఇంగ్లీషులో ప్రశ్నించేయడం గమనార్హం.
ఔను, తెలుగు నేలపై తెలుగు మాట్లాడటం ఓ నామోషీ. అసలు తెలుగులో చదువుకోవడమే పెద్ద నేరమని తీర్మానించేసే రోజులొచ్చేశాయ్. ఆ లెక్కన, మిథాలీ తెలుగులో మాట్లాడటం అంటే తప్పు చేసినట్టే కదా.?