Pawan Kalyan Caste Politics.. రాజకీయం లేనిదెక్కడ.? అన్నిటా రాజకీయం, అంతటా రాజకీయం.! ఆ రాజకీయంలో కుల ప్రస్తావన లేకపోవడమంటే, అది సాధ్యమయ్యే పనే కాదు.!
పేరు చివర్న ‘తోకలు’ తగిలించుకోవడం ద్వారా తమ తమ సామాజిక వర్గాల్లో బలమైన నాయకులుగా ఎదిగినవారు కూడా, ఇతరులెవరూ ‘కుల ప్రస్తావన’ చేయకూడదని కోరుకుంటారు.!
కులాభిమానం తప్పు కాదు.! మతం విషయంలో అయినా అంతే. కానీ, కుల దురహంకారం వుండకూడదు.. మత ఛాందసవాదం వుండకూడదు.
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Janasenani Pawan Kalyan) ప్రజల్లో మార్పు కోరుకుంటున్నారు.. వ్యవస్థల్లో మార్పు కోరుకుంటున్నారు.
Pawan Kalyan Caste Politics.. రాజకీయం చేయనిదెవరు.?
సరే, ఓ రాజకీయ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా రాజకీయాలే చేస్తారనుకుందాం. అసలు రాజకీయం చేయనిదెవరు.?
హిందువుల పండగల్లో పంచె కట్టేసే క్రిస్టియన్ నాయకులు.. రంజాన్ సమయాల్లో నిఖార్సయిన ముస్లిం వేషధారణలో కనిపించే హిందూ నాయకులు.. ఇది రాజకీయాల్లో కొత్తేమీ కాదు.. దాన్ని తప్పు పట్టాల్సిన పనీలేదు.
కులం విషయానికొస్తే, తాము అధికారంలో వున్నప్పుడు.. కేవలం తమ సామాజిక వర్గానికి చెందినవారికే మేలు చేయాలని చూసే రాజకీయ పార్టీలు రాజ్యమేలుతున్న రోజులివి.

సలహాదారుల్లో మెజార్టీ తమ సామాజిక వర్గానికి చెందినవారినే నియమించుకుంటే తప్ప, తమకు రాజకీయంగా భద్రత వుండదని భావించే రాజకీయ నాయకులు వ్యవస్థల్ని శాసిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం.
కులాల్ని కలిపే రాజకీయం అవసరం.. మతాల ప్రస్తావన వుండని రాజకీయం అవసరం.. అని జనసేనాని చెబితే, కుల భావన మంచిదే.. కానీ, ఇతరుల మీద విషం చిమ్మేలా వుండకూడదని జనసేనాని పిలుపునిస్తే, దాని మీద మళ్ళీ యాగీ.!
పేరు చివరన తోకలెట్టుకున్నోళ్ళు కూడా.!
ఇంటి పేరు.. అసలు పేరు చివరన ‘తోక’ పెట్టుకుంటేగానీ, రాజకీయం చేయలేనివారు. తాము ఆచరిస్తున్న మతమేదో కూడా బయటకు చెప్పుకోలేనివారున్నారు.
అలాంటోళ్ళు, పైన చెప్పుకున్న అవలక్షణాలేవీ తన పేరులో కనిపించనీయని పవన్ కళ్యాణ్ మీద కులం పేరుతో, మతం పేరుతో విమర్శలు చేయడమంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?
చివరగా.. ఇతర కులాలతో, ఇతర మతాలతో సంబంధాలు (తమ వారసుల పెళ్ళిళ్ళ విషయంలో) కలుపుకుంటున్న రాజకీయ నాయకులు, అధికారంలోకి వచ్చాక, ఆయా సామాజిక వర్గాల మీద దుష్ప్రచారం చేయడంలో అర్థమేంటి.?
Also Read: జస్టిస్ ఫర్ కొరటాల.! ‘ఆచార్య’పై ఎవరిదీ ‘మెగా’ గోల.!
నిజానికి రాజకీయ నాయకులు కులం, మతం, ప్రాంతం.. అనే వాటికి అతీతంగా ప్రవర్తించాలి, ప్రవర్తిస్తుంటారు కూడా.
కానీ, రాజకీయ అవసరాల కోసం వాటిని ‘అస్త్రాలుగా’ ప్రయోగిస్తుంటారు.. అదీ జనం మీద. అదే అసలు సమస్య.! దాన్నే, సమాజమ్మీద జరుగుతోన్న ఆ విష ప్రయోగాన్నే జనసేనాని తప్పు పడుతున్నారు.