Bandla Ganesh Liger Vijay.. బండ్ల గణేష్‌కి ఏమయ్యింది.? కొత్తగా ఏమవ్వాలి.? ఎప్పుడూ ఎవరో ఒకర్ని కెలుకుతుంటాడు.
బండ్ల గణేష్ (Bandla Ganesh) నిజానికి మంచోడే కానీ, నోటి దురద. ఈ మధ్య ట్వీటు దురద కూడా ఎక్కువైపోయినట్టుంది.!
తాజాగా, బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా విజయ్ దేవరకొండ అభిమానుల్ని కెలికాడు. విజయ్ దేవరకొండనీ (Vijay Deverakonda) కెలికాడు.!
‘తాతలు తండ్రులు ఉంటే సరిపోదు. టాలెంట్ కూడా ఉండాలి. ఎన్టీయార్లా మహేష్‌బాబులా చరణ్‌లా ప్రభాస్‌లా.. గుర్తు పెట్టుకో బ్రదర్..’ అంటూ సెలవిచ్చాడు బండ్ల గణేష్.
Bandla Ganesh Liger Vijay.. ఎవర్ని కెలికావ్ బండ్లన్నా.?
ఇంతకీ బండ్ల గణేష్ తన ట్వీటు ద్వారా ఎవర్ని, ఎందుకు కెలికినట్టు.? విజయ్ దేవరకొండనే బండ్ల గణేష్ కెలికాడన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన.
బండ్ల గణేష్ ట్వీటు కింద అదే విషయాన్ని నెటిజనం స్పష్టం చేస్తున్నారు. బండ్ల మీద కౌంటర్ ఎటాక్ట్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.

తన తాజా చిత్రం ‘లైగర్’ ప్రమోషన్స్‌లో భాగంగా హైద్రాబాద్‌లో ఓ ఈవెంట్ జరిగితే, అందులో పాల్గొన్న విజయ్ దేవరకొండ, తన పట్ల బోల్డంత అభిమానం చూపిస్తోన్న అభిమానుల్ని చూసి మురిసిపోయాడు.
విజయ్ మాట్లాడిన దాంట్లో తప్పేముందబ్బా.?
‘మా తాత తెల్వదు.. మా నాన్న తెల్వదు.. అయినా మీకు నేనంటే ఎంత అభిమానం.?’ అంటూ ఒకింత ఉద్వేగానికి గురయ్యాడు రౌడీ హీరో.
‘నా సినిమా విడుదలై రెండేళ్ళయ్యింది.. అయినా, మీలో అదే ఉత్సాహం కనిపిస్తోంది..’ అంటూ విజయ్ వ్యాఖ్యానించాడు తన అభిమానుల్ని ఉద్దేశించి.
దీన్ని పట్టుకుని, బండ్ల గణేష్ వెకిలి ట్వీట్ వేశాడా.? అసలు విజయ్ దేవరకొండని, పైన పేర్కొన్న హీరోలతో పోల్చాల్సిన అవసరం బండ్లకి ఏమొచ్చింది.
Also Read: స్నేహా ఉల్లాల్, జరీన్.. సల్మాన్‌తో కనెక్షన్ ఏంటంటే.!
నిజమే, విజయ్ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చాడు. ఎన్టీయార్, చరణ్, ప్రభాస్, మహేష్. వీళ్ళందరికీ బ్యాక్‌గ్రౌండ్ వుంది.
ఔను, నిజం.. బ్యాక్‌గ్రౌండ్ మాత్రమే సరిపోదు, టాలెంట్ వుంటేనే నిలదొక్కుకుంటారు. నిజానికి, టాలెంట్ ఒక్కటీ సరిపోదు, లక్కు కూడా కావాలి. అప్పుడే సినీ పరిశ్రమలో ఎవరైనా సక్సెస్ అవుతారు.
బండ్ల గణేష్ ట్వీటులోనే క్లారిటీ లేదు. దాని మీద మళ్ళీ యాగీ ఒకటి. మతిలేని ట్వీటేసినా, బండ్ల గణేష్ తాను కోరుకున్న పబ్లిసిటీ అయితే సంపాదించుకున్నాడు.