Tanushree Dutta Publicity Stunt.. మీటూ రగడ.! అప్పుడెప్పుడో ముగిసిపోయిన అధ్యాయమిది. అప్పట్లో పెను దుమారమే రేపి, ఆ తర్వాత చల్లారిపోయింది.
బాలీవుడ్ బ్యూటీ తనూ శ్రీ దత్తా (తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన ఓ సినిమా చేసింది లెండి..) పనిగట్టుకుని, ఇంకా ఆ ‘మీ టూ’ వివాదాన్ని కెలుకుతూనే వుంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ (Nana Patekar) తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడనీ, తన కెరీర్ని దెబ్బ తీశాడనీ అప్పట్లో ఆరోపణలు గుప్పించింది తనూ శ్రీ దత్తా (Tanushree Dutta).
అప్పటినుంచి, ఇప్పటిదాకా.. తనూశ్రీ ఆ వివాదంతో పబ్లిసిటీ స్టంట్లు చేస్తూనే వుంది. కానీ, ఎన్నాళ్ళిలా.?
Tanushree Dutta Publicity Stunt.. ఆ అవసరం ఎవరికుంది.?
మీటూ.. సమసిపోయిన వివాదం. తరచూ సెలబ్రిటీలు ఈ ఆరోపణలు చేస్తూ వస్తున్నారంటే, అవి కేవలం పబ్లిసిటీ స్టంట్లు మాత్రమే.

పని ప్రాంతాల్లో మహిళలపై అసభ్యకర ప్రవర్తన అనేది నిత్యం జరుగుతూనే వుంటోంది. కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.?
పైగా, దీన్నొక పబ్లిసిటీ స్టంటుగా మార్చేశాక, ఇంకా ఈ వివాదంలో ఆజ్యం పోసే పని చేయడం వల్ల ఉపయోగమేంటి.?
నిజానికి, తనూశ్రీ దత్తా ఇప్పుడేమీ కెరీర్ పరంగా యాక్టివ్గా లేదు. ఆమె చేస్తోన్న పోరాటంలోనూ చిత్తశుద్ధి లేకుండా పోయింది.
Also Read: నభా నటేష్ ‘డేటింగ్’ పైత్యం.! ఛీ పాడు యాపారం.!
నిత్యం వార్తల్లో వుండేందుకే తనూశ్రీ దత్తా ఈ ‘మీటూ’ వ్యవహారం పేరుతో సందడి చేస్తోందనేది ప్రధానంగా వినిపిస్తోంది. ఆ పరిస్థితిని ఆమె స్వయంగా కొనితెచ్చుకుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే, మీటూ గురించి మాట్లేడంత తీరిక ఇప్పెడరికీ లేదు.. ఒక్క తనూశ్రీ దత్తాకి (Tanushree Dutta) తప్ప. అది ఆమెకు చారిత్రక అవసరంగా మారిపోయిందంతే.!
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ.. వివిధ సినీ పరిశ్రమల్లో ఒకప్పుడు మీటూ ప్రకంపనల్ని చూశాం. నడి రోడ్ల మీద అర్ధనగ్నంగా కొందరు నటీమణులు చేసిన రచ్చ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.!
కొందరు నిజంగానే తాము ఎదుర్కొన్న ఇబ్బందుల్ని చెప్పుకుంటే, ఇంకొందరు.. వారి వాస్తవ ఆవేదనను తెరమరుగు చేసేలా చిత్ర విచిత్రమైన విన్యాసాలతో హంగామా సృష్టించారు.
అందుకే, ‘మీటూ’ (Me Too) ఓ అట్టర్ ఫ్లాప్ షో అయిపోయింది.!