Table of Contents
Paracetamol Dolo 650.. కేవలం వెయ్యి కోట్లు.. కాదు, అంతకు మించి. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది పారాసిటమాల్ అనే మందుకి సంబంధించిన ఓ ట్యాబ్లెట్ గురించి మాత్రమే.
ఆ మాత్ర పేరు అందరికీ తెలిసిందే. అదే ‘డోలో 650’. కోవిడ్ పాండమిక్ సమయంలో ఎవరి నోట విన్నా ఇదే మాట. ముఖ్యమంత్రులు సైతం, ఈ ట్యాబ్లెట్‌కి బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయారు.
తెలిసినోడు, తెలియనోడు, చదువుకున్నోడు, చదువు లేనోడూ.. అందరూ ‘డోలో 650’ ట్యాబ్లెట్ గురించి మాట్లాడేసినోళ్ళే.!
Paracetamol Dolo 650.. వెయ్యి కోట్లు కొట్టేశారట..
పారాసిటమాల్ మందుతో చాలా మాత్రలున్నాయ్. అయితే, వేటికీ లేనంత ఫాలోయింగ్ ‘డోలో 650’కి ఎందుకు వచ్చిందట.? ఇదొక పబ్లిసిటీ మాయ.!
ఏకంగా వెయ్యి కోట్ల మాయా జాలం జరిగిందట ఈ ‘ట్యాబ్లెట్’ పేరుతో. అంటే, కేవలం ‘డోలో 650క్’ని ఉద్ధరించడానికే, భారతదేశంలోకి కోవిడ్ వైరస్ వచ్చిందేమో అనిపిస్తే, అది మీ తప్పు కాదు.
నిజానికి, వెయ్యి కోట్లు అన్నది చాలా చాలా చిన్న విషయం.. కోవిడ్ పరిణామాల నేపథ్యంలో రకరకాల ఇంజెక్షన్ల పేర్లు ప్రచారంలోకొచ్చాయ్. వందల కోట్లు, వేల కోట్ల వ్యాపారాలు జరిగాయ్.
దోచేశారు, అడ్డంగా దోచేశారు. శవాల మీద కూడా చిల్లర ఏరుకున్నాయి పెద్ద పెద్ద ప్రైవేటు ఆసుపత్రులు.
ఇదొక మాఫియా.!
నిజానికి, ఇదొక మాఫియా.! ఆ మాటకొస్తే, ‘మాఫియా’ అన్నది చాలా చాలా చిన్న మాటే అవుతుంది. అందినకాడికి దోచేశారు. శవాలతో వ్యాపారం చేశారు.

కోవిడ్ పాండమిక్.! చాలా జీవితాల్ని నాశనం చేసింది. చాలా కొన్ని జీవితాల్ని మాత్రం బాగు చేసింది. అలా బాగుపడ్డోళ్ళంతా మెడికల్ మాఫియా బ్యాచ్.!
దోచుకున్నోడికి దోచుకున్నంత..
ఇప్పుడు చెప్పండి, కేవలం పారాసిటమాల్ దోపిడీ గురించి మాట్లాడుకుంటే సరిపోతుందా.? అసలంటూ, ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ దోపిడీ మాటేమిటి.?
రాజకీయ నాయకుల ప్రేమయం లేకుండా ఇంత పెద్ద మాఫియా ఎలా నడుస్తుంది.? ఆక్సిజన్ పేరుతో దోచేశారు.. బ్లాక్ ఫంగస్ అన్నారు.. వెంటిలేటర్లు పెట్టి ముంచేశారు.! అబ్బో, ఆ కథ చాలా పెద్దది.
Also Read: పావురం చేసిన హత్య.! మీనా భర్తకి అసలేం జరిగింది.?
కోవిడ్ వల్ల చనిపోయినవారికి అంతిమ సంస్కారాలు చేయడానికి స్మశానాల్లో చోటు సైతం దొరకని పరిస్థితుల్లో అంబులెన్స్ మాఫియా గురించి కూడా విన్నాం.!
శవాల్ని సైతం పీక్కు తినడం.. అని ఇలాంటి పరిస్థితి గురించే మాట్లాడుకుంటాం. ఆప్టరాల్ పారాసిటమాల్ వెయ్యి కోట్లు.. అంతేనా.?
కొసమెరుపేంటంటే.. కేవలం డోలో 650 మాత్రని డాక్టర్లు పేషెంట్లకు సూచించినందుకే.. వెయ్యి కోట్ల మేర ‘తాయిలాలు’ ఇచ్చినట్లు ఆరోపణలు రావడం.!
అంటే, దోపిడీ ఎన్ని వేల కోట్లు అయి వుండాలి.? లక్ష కోట్ల పైనే వున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో.!