Sid Sriram Telugu మళ్డింది.! ఇది తెలుగు భాషేనా.? తెలుగు భాషకి ఎప్పుడో తెగులు పట్టేసింది. అనసూయ సహా చాలామంది తెలుగు యాంకర్లకు తెలుగు రాకపోయినా, కొట్టుకుపోతోందంతే.!
తెలుగు రాకపోవడం కూడా ఓ అందమే.. అన్నట్టు తయారైంది వ్యవహారం. అందుకే, తెలుగుకి ఎంత తెగులు పట్టించేస్తే అంత ‘క్యూట్’ అన్నమాట ఇప్పుడు.!
సరే, అసలు విషయంలోకి వద్దాం. ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ విషయంలో చాలా అభ్యంతరాలు చాలాకాలం నుంచీ వున్నాయ్.
హయ్యస్ట్ పెయిడ్ సింగర్.. లోయెస్ట్ తెలుగు పలుకులు.!
కానీ, సిద్ శ్రీరామ్ (Sid Sriram) అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. సంగీతం లేకపోయినా, ఆయన గాత్రమే సంగీతం అంటాడో సినీ హీరో. అంతలా సిద్ శ్రీరామ్ పాటల మోజులో పడి కొట్టుకుంటున్నారు.
తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే సింగర్ ఇంకెవరో కాదు సిద్ శ్రీరామ్. చెత్త శ్రీరామ్ అని ఎవరైనా అతని పేరుని పలికితే ఎలా వుంటుంది.? ఒళ్ళు మండిపోదూ.?
మరి, ‘ఉంటే’ అనే మాటని, ‘ఉళ్టే’ అని ఆయన ఎలా తన పాటలో పలికేస్తున్నాడు.? ఇక్కడ గేయ రచయితలు, సంగీత దర్శకుల తప్పు కూడా వుంది.
Sid Sriram Telugu.. తెలుగుకి తెగులు పట్టి చచ్చిపోతోంది.!
సిద్ శ్రీరామ్ తెలుగోడు కాదు, తెలుగు పదాలు తెలియాల్సిన అవసరమూ ఆయనకి లేదు. డబ్బులిస్తున్నారు, పాట పాడి వెళ్ళిపోతున్నాడు.

ఆ మాటకొస్తే, శ్రేయా ఘోషల్ తెలుగు గాయని కాదు. కానీ, ఆమె తెలుగులో స్పష్టంగా పాడుతుంది. తేనెలొలుకుతుంది ఆమె తెలుగు పాట.
సిద్ శ్రీరామ్ విషయంలో అలా కాదు. పాటని బాగా పాడతాడు. లిరిక్స్ మాత్రం ఖూనీ అయిపోతాయ్.! ఇదే విషయాన్ని ఓ పెద్దాయన ప్రస్తావించారు. అంతే, సిద్ శ్రీరామ్ అభిమానులకి బాగా మంటెక్కింది.
Also Read: అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్.! ఏంటీ జుగుప్స.?
భయానకమైన రీతిలో ట్రోలింగ్ చేసేస్తున్నారు. అందులో మన తెలుగు సినీ పాటల ప్రియులు కూడా వున్నారు. ప్చ్.. తెలుగు పాటలనుకుంటున్నారుగానీ, కాదవి తెగులు పాటలు.!
ఇప్పుడర్థమయ్యింది కదా, మండింది కాస్తా, మళ్డింది ఎలా అయ్యిందో.!
చివరగా.. సిద్ శ్రీరామ్ ఎలాగూ మారడు, తెలుగుని గౌరవించడు.! కానీ, తెగులు పట్టిన తెలుగు సినిమా ప్రముఖులైనా, కాస్త మారాలి కదా.?
అందుకే, ఆ పెద్దాయన.. మన తెలుగు సినీ ప్రముఖులకే సూచించారు.. పాటల్లో కొన్ని పదాల్ని వాడొద్దని. ‘వుంటే..’ లాంటి పదాలన్నమాట.
విళ్టారా మరి.? తప్పు తప్పు, వింటారా మరి.?