Nivetha Thomas Marriage.. తొలి తెలుగు సినిమా ‘జెంటిల్‌మెన్’ నుంచి ఇప్పటిదాకా చేసే ప్రతి సినిమా విషయంలోనూ కొత్తదనం వెతుక్కుంటోంది మలయాళ బ్యూటీ నివేదా థామస్.!
స్టార్ హీరోయిన్ అయిపోలేదుగానీ, మంచి నటిగా గుర్తింపు మాత్రం సంపాదించుకున్న నివేదా థామస్, తన పెళ్ళి గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
ఇంతకీ నివేదా థామస్ పెళ్ళెప్పుడు.? అన్న ప్రశ్నకు అంతా ఆశ్చర్యపోయేలా సమాధానమిచ్చింది.
Nivetha Thomas Marriage.. పెళ్ళి.. అవుతుంది ఎప్పుడో ఒకప్పుడు.!
ఇప్పుడు, అప్పుడు అని చెప్పునుగానీ, ఎప్పుడో ఒకప్పుడు పెళ్ళయితే అవుతుందంటూ ఒకింత ఇంట్రెస్టింగ్‌గా బదులిచ్చింది నివేదా థామస్, పెళ్ళెప్పుడన్న ప్రశ్నకి.
ప్రేమ పెళ్ళా.? పెద్దలు కుదుర్చిన పెళ్ళా.? అంటే, అది కూడా నేనిప్పుడు చెప్పలేను.. దానికింకా సమయం వుంది.. ఇప్పట్లో పెళ్ళి ఆలోచన అయితే లేదని నివేదా థామస్ క్లారిటీ ఇచ్చేసింది.

ఇంటర్వ్యూ కోసమైతే, ఏదో ఒకటి మాట్లాడేయొచ్చనీ.. అది తనకు ఇష్టం వుండదనీ చెప్పుకొచ్చింది నివేదా థామస్ (Nivetha Thomas).
అంతే కాదు, ‘పెళ్ళి చేసుకోండి.. బావుంటుంది..’ అంటూ పెళ్ళి చేసుకోవాలనుకునేవారికి ఉచిత సలహా కూడా ఫన్నీగా ఇచ్చేసిందామె. మహా మాటకారే సుమీ నివేదా థామస్ అంటే.!
వకీల్ సాబ్.. వెరీ వెరీ స్పెషల్.!
‘వకీల్ సాబ్’ (Vakeel Saab) తనకు మెమరబుల్ ఫిలిం అనీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అనే కంటే, ఓ మంచి మనిషి పవన్ కళ్యాణ్ అనడం సబబనీ అంటోంది ఈ మలయాళ బ్యూటీ.
Also Read: ఫాఫం ‘లైగర్’ పాప.! అనన్య పాండే కూడా ఔట్.!
రీల్ లైఫ్ కథానాయకుడు.. రియల్ లైఫ్‌లోనూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మంచి నాయకుడని నివేదా థామస్ (Nivetha Thomas) చెప్పడం గమనార్హం.
‘వకీల్ సాబ్’ (Vakeel Saab) సినిమాలో నివేదా థామస్ (Nivetha Thomas) పాత్రకి విమర్శకుల ప్రశంసలు దక్కిన విషయం విదితమే.