Samantha Ruth Prabhu Health.. ఔను, సమంతకి ఏమయ్యిందిట.?
సోషల్ మీడియాలోనూ, వెబ్ మీడియాలోనూ.. చివరికి మెయిన్‌స్ట్రీమ్ మీడియాలోనూ సమంత విషయమై ఎందుకు పుకార్లు షికార్లు చేస్తున్నాయ్.?
గత కొంతకాలంగా సోషల్ మీడియాకి దూరంగా వుంటోంది సమంత. మరీ, దూరంగా కాదుగానీ.. ఒకప్పటిలా యాక్టివ్‌గా అయితే లేదు.
అదే అన్ని సమస్యలకీ కారణం. సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ‘అక్కినేని’ పేరు తీసేయడంతో మొదలైన విడాకుల ఊహాగానాలు, విడాకులు తీసుకున్నాకనే ఆగాయ్. ఇలా వుంటుంది సోషల్ మీడియా కథ.!
Samantha Ruth Prabhu Health.. సమంతకి అనారోగ్య సమస్యలున్నాయా.?
సమంతకి తీవ్ర అనారోగ్యమంటూ సోషల్ మీడియాలోనూ, వెబ్ మీడియాలోనూ పుంఖానుపుంఖాలుగా కథనాలు దర్శనమిస్తున్నాయ్.
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సమంత, విదేశాలకు వెళ్ళి అక్కడే వైద్య చికిత్స తీసుకోనుందనీ, తీసుకుంటోందనీ.. బోల్డన్ని వార్తలు దండిగా కనిపిస్తున్నాయి.

ఇంతకీ, అసలు వాస్తవమేంటి.? ఎప్పుడూ ఫిట్‌గా వుండే సమంతకి వచ్చిన ఆ కష్టమేంటి.? అంటే, డిప్రెషన్ అట. దాంతోపాటుగా, స్కిన్ సంబంధిత సమస్యతోనూ ఆమె బాధపడుతోందట.
సమంత ఖండించడంలేదేం.?
మామూలుగా అయితే ఇలాంటి వార్తల్ని సమంత వెంటనే ఖండించేస్తుంటుంది. ఈసారెందుకో ఖండించడానికి కాస్త సమయం తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.
Also Read: కెప్టెన్ వర్సెస్ బ్యాడ్ కెప్టెన్: శ్రీసత్యపై దారుణమైన ట్రోలింగ్.!
సమంత స్పందిస్తే సరే సరి.. లేకపోతే, ప్రచారంలో వున్నదే నిజమని భావించాల్సి వస్తుందేమో.! సమంత సన్నిహితులు సైతం, ‘సమంతకి అనారోగ్య సమస్యలు’ అన్న ప్రచారంపై స్పందించడంలేదుట.