తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవిని (Megastar Chiranjeevi) చాలామంది ‘గాడ్ ఫాదర్’ అని పిలుస్తుంటారు.
ఇంతకీ, మెగాస్టార్ చిరంజీవికి ఎవరు గాడ్ ఫాదర్.? ఈ ప్రశ్నకి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సమాధానమిచ్చేశారు. అదీ ‘గాడ్ ఫాదర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో.
మలయాళ సినిమా ‘లూసిఫర్’ని తెలుగులోకి ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ చేసిన విషయం విదితమే. ఇదొక పొలిటికల్ థ్రిల్లర్.!
Megastar Chiranjeevi.. గాడ్ ఫాదర్.. అంటే, అది అభిమానమే.!
‘నాకు గాడ్ ఫాదర్ ఇంకెవరో కాదు.. మీరే, మీ అభిమానమే. నాకు ఎవరూ గాడ్ ఫాదర్ లేరని అంతా అనుకుంటుంటారు. మీరున్నారు కదా.!’ అంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు.

ఎంత ఎదిగినా ఒదిగి వుండడం అనేది మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకత. ఆయన సక్సెస్ సీక్రెట్ కూడా అదే.
ఇప్పటికీ తొలి సినిమా హీరో లాగానే చిరంజీవి వ్యవహరిస్తుంటారు. ‘నా సినిమానీ, నన్నూ ఆశీర్వదించండి ప్లీజ్..’ అంటూ అప్‌కమింగ్ హీరో అడిగినట్లు, ప్రేక్షకుల్ని అడిగారు చిరంజీవి.
పేరు పేరునా అందర్నీ ప్రమోట్ చేసిన చిరంజీవి..
సినిమా కోసం పని చేసిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులందరినీ ‘ప్రమోట్’ చేయాలన్న ఉద్దేశ్యంతోనే ‘గాడ్ ఫాదర్’ (Godfather) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించినట్లు చిరంజీవి (Chiranjeevi) వ్యవహరించారు.
గొప్ప నటుడిగా తెలుగు తెరపై సత్య దేవ్ వెలుగుతాడని చెప్పడం దగ్గర్నుంచి స్టంట్ కొరియోగ్రాఫర్స్ రామ్‌లక్ష్మణ్‌ల వ్యక్తిత్త్వం వరకు.. అందరి గురించీ తనదైన స్టయిల్లో చిరంజీవి చెప్పుకొచ్చారు.
Also Read: సిద్ శ్రీరామ్.! తెగులు పాటకి ‘నువ్వుళ్టే’ ఆ కిక్కే వేరప్పా.!
ఎవరూ ఊరికే మెగాస్టార్లు అయిపోరు. 150కి పైగా సినిమాలు చేశాక కూడా చిరంజీవికి (Chiranjeevi), సినిమా పట్ల అదే అంకిత భావం. తోటి నటుల పట్ల గౌరవం, టెక్నీషియన్ల పట్ల గౌరవం. దటీజ్ మెగాస్టార్ చిరంజీవి.
వ్యక్తిత్వాన్ని ఎప్పటికప్పుడు ఎవరైతే మెరుగు పరచుకుంటారో, దానికోసం ఎప్పటికప్పుడు కృషి చేస్తుంటారో.. వాళ్ళే సెల్ఫ్ మేడ్ స్టార్స్ అవుతారు. చిరంజీవి (Godfather Chiranjeevi) చాలామందికి గాడ్ ఫాదర్.! ఆయనకి ఆయనే గాడ్ ఫాదర్.!