నటి సమంత సోషల్ మీడియా వేదికగా ఏదో చెప్పాలనుకుంది, చెప్పేసింది కూడా.! ఇంతకీ, సమంత (Samantha Ruth Prabhu) ఏం చెప్పింది.? ఏం చెప్పాలనుకుంది.?
ఈ మధ్య సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండటంలేదు. కారణమేంటబ్బా.? అని కొందరు ఆరా తీసేస్తున్నారు.
సాధారణంగా సెలబ్రిటీల సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని ఎవరో డీల్ చేస్తుంటారు. సందర్భానుసారం ఆయా పోస్టులు పెడుతుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.!
Samantha Ruth Prabhu.. అసలు ఆ మాటలో అర్థమేంటి.?
సమంత తాజాగా ‘Down not out’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో రాసుకొచ్చింది.. ఓ ఫొటో కూడా పెట్టింది. తన పెంపుడు శునకం తాలూకు ఫొటో.. అదీ ఒకింత అసభ్యకరంగానే వుందా ఫొటో.

అందులోనూ చాలా అర్థం కనిపించింది చాలామందికి. ‘డౌన్ నాట్ ఔట్’ అంటే, ‘వెనక్కి తగ్గాను, కానీ ఓడిపోలేదు..’ అంటూ ఏదో సందేశం సమంత ఇచ్చిందట.
వామ్మో, ఈ ఫొటోలో అంత అర్థం వుందా.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంకొంతమందైతే, ‘ఛీ, ఛండాలం..’ అంటున్నారు ఆ ఫొటోని చూసి.
పెంపుడు పైత్యం అలాగే వుంటుందా.?
పెంపుడు జంతువులంటే ఇష్టపడనివాళ్ళు ‘పెంపుడు పైత్యం’ అంటూ మండిపడుతుంటారు. కానీ, పెంపుడు జంతువుల్ని కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా చూసుకునేవాళ్ళకి, ‘అందులో ప్రేమ’ కనిపిస్తుంటుంది.
సరే, ఆ పెంపుడు పంచాయితీలోకి ఎందుకు వెళ్ళాలిగానీ, సమంత వెనక్కి తగ్గడమేంటి.? ఓడిపోవడం.. ఓడిపోకపోవడం సంగతేంటి.?
మహానుభావులకే అలాంటివి అర్థమవుతాయ్. వాళ్ళు అలా అర్థం చేసుకోవాలనే, అర్థం అయ్యీ.. అవనట్టుండేలా సెలబ్రిటీలూ సోషల్ మీడియాలో ఆనిముత్యాల్ని వదులుతుంటారు.
Also Read: Alia Bhatt Business.. ఈ కొత్త ఐడియా అదిరిందయా.!
చక్కనమ్మ ఏం చెప్పినా బాగానే వుంటుందంటారా.? అదీ నిజమేననుకోండి.. అది వేరే సంగతి.
సమంత సినిమాల విషయానికొస్తే, ‘శాకుంతలం’ సినిమా కాస్త వెనక్కి వెళ్ళింది. ‘యశోద’ సినిమా ఎప్పుడొస్తుందన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.
ఇంతకీ, సమంత సినిమాలు ఇలా వెనక్కి వెళ్ళిపోతుండడానికి కారణం ఏమై వుంటుందబ్బా.?