Table of Contents
Puri Jagannadh సక్సెస్ మరియు ఫెయిల్యూర్ అనుకుంటాం.. కాదు, ఈ రెండూ ఫ్లోలో వుంటాయ్.! ఒకదాని తర్వాత ఇంకోటి వస్తాయ్.!
ఇది దర్శకుడు పూరి జగన్నాథ్ నుంచి వచ్చిన తాజా ఆణిముత్యం. అంతేనా, ఇంకా చాలా వున్నాయ్.!
గుండెల నిండా ఊపిరి పీలిస్తే బతుకుతామని అనుకుంటాం.. కానీ, వెంటనే చెయ్యాల్సిన పని ఏంటి.? ఊపిరి వదిలెయ్యడమే.! ఇది కూడా పూరి నుంచి వచ్చిన ఇంకో ఆణిముత్యమే.
అసలేమయ్యింది పూరి జగన్నాథ్‌కి.?
ఈ మధ్యనే ‘లైగర్’ సినిమాతో దెబ్బ తిన్నాడు పూరి జగన్నాథ్. కాదు కాదు దెబ్బ తీశాడు.. అటు ప్రేక్షకుల్నీ, ఇటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లనీ.!
సినిమా అన్నాక హిట్టూ, ఫ్లాపూ మామూలే. అంతమాత్రాన ‘దెబ్బ కొట్టాడు’ అనడం ఎంతవరకు సబబు.? నిజమే, అలా ఆయన్ని తప్పు పట్టడం నిజంగానే తప్పు.!
‘పడతాం, లేస్తాం, ఏడుస్తాం, నవ్వుతాం.. ఎన్నో రోజులు ఏడ్చినాక నెక్స్‌ట్ జరిగేదేంటి.? పగలబడి నవ్వడమే.! ఇక్కడ ఏదీ పర్మనెంట్ కాదు.. అని సెలవిచ్చాడు పూరి.
‘లైఫ్‌లో మనకి జరిగే ప్రతి సంఘటనని మనం ఒక ఎక్స్‌పీరియన్ష్‌లా చూడాలి తప్ప, ఫెయిల్యూర్ సక్సెస్‌లా చూడకూడదు.’ ఇదొక ఆణిముత్యం.
మైండ్‌కి తీసుకుంటే మెంటల్ వస్తుంది..
‘నడిచా, మెట్లు ఎక్కా, పడిపోయా, కాలు జారింది, నదిలో పడ్డా, కొట్టుకు పోయా, వడ్డుకు చేరా, ఇంట్లో తిట్టారు, ఊరు వెలేసింది, ఉరేసుకోవాలనిపించింది, ఎవరో కాపాడాడు, వాడు నేను కౌగలించుకున్నాం, వాడే మోసం చేసాడు, ఇలా ఎన్నెన్నో లైఫ్‌లో జరుగుతుంటాయి. అవన్నీ సీన్లే. అందుకే లైఫ్‌ని సినిమాలా చూస్తే, షో అయిపోగానే మర్చిపోవచ్చు. మైండ్‌కి తీసుకుంటే మెంటల్ వస్తుంది. సక్సెస్ అయితే డబ్బులొస్తాయి’ ఇది ఇంకో ఆణిముత్యమండోయ్.
అన్నట్టు, ఫెయిల్ అయితే బోలెడు జ్ఞానం వస్తుందట. సో ఎప్పుడూ మనం మెంటల్లీ, ఫైనాన్షియల్లీ గెయిన్ అవుతుంటామే తప్ప, ఈ ప్రపంచంలో మనం కోల్పోయేది ఏదీ లేదు.. అంటున్నాడు పూరి.
అందుకే దేన్నీ ఫెయిల్యూర్‌గా చూడకూడదట. బ్యాడ్ జరిగితే మన చుట్టూ వున్న బ్యాడ్ పీపుల్ మాయమైపోతారట. వెనక్కి తిరిగి చూస్తే ఎవడు మిగిలాడో తెలుస్తుందట.

మంచిదే కదా.! కానీ, ఖాళీగా వుండకూడదు, ఏదో ఒకటి చెయ్యాలట. అది రిస్క్ అవ్వాలి. లైఫ్‌లో రిస్క్ చెయ్యకపోతే అది లైఫే కాదు.. ఏ రిస్క్ చేయకపోతేనే అది ఇంకా రిస్క్ అన్నది పూరి ఉవాచ.
హీరో నువ్వేగానీ..
లైఫ్‌లో నువ్వు హీరో అయితే సినిమాలో హీరోకి ఎన్ని జరిగాయో అవన్నీ నీకు కూడా జరుగుతాయి. పొగుడుతారు, నిందిస్తారు, బొక్కలో వేస్తారు, మళ్ళీ విడుదల చేస్తారు. అందరూ క్లాప్స్ కొడతారు, అక్షింతలు వేస్తారు. సో, ఇవన్నీ మీ లైఫ్‌లో జరగకపోతే, జరిగేలా చూడండి.
లేకపోతే మీరు హీరో కాదేమో అనుకునే ప్రమాదం వుందిట. అందుకే మనం హీరోలా బతకాలంటున్నాడు. బతకాలి అంటే నిజాయితీ వుండాలట.
అన్నట్టు, నేను నిజాయితీపరుడినని చెప్పుకోనవసరం లేదని పూరి చెబుతున్నాడండోయ్. నిజాన్ని కాపాడాల్సిన అవసరం కూడా లేదట. నిజాన్ని నిజమే కాపాడుకుంటుందట. ట్రూత్ ఆల్వేజ్ డిఫెండ్స్ ఇట్‌సెల్ఫ్ అని పూరి సెలవిచ్చాడు.
ఎవరినుంచి ఏదీ ఆశించకుండా, ఎవరినీ మోసం చేయకుండా మన పని మనం చేసుకుంటూ పోతే మనల్ని పీకేవాళ్ళు ఎవరూ వుండరు. నేను ఎప్పుడైనా మోసం చేస్తే, దగా చేస్తే అది నన్ను నమ్మి నా సినిమా టిక్కెట్ కొన్న ఆడియన్స్‌ని తప్ప నేను ఎవరినీ మోసం చెయ్యలేదు.
మళ్ళీ ఇంకోస్సారి..
Actually i’m liable to my audience.. కేవలం ప్రేక్షకులకు మాత్రమే జవాబుదారీ అట. మళ్ళీ ఇంకో సినిమా తీస్తాడట. వాళ్ళని ఎంటర్టైన్ చేస్తాడట. ఇక డబ్బు అంటారా.? చచ్చినాక ఇక్కడి నుంచి ఒక్క రూపాయి తీసుకెళ్ళిన, ఒక్కడి పేరు నాకు చెప్పండి, నేనూ దాచుకుంటానంటున్నాడు పూరి.
Also Read: నయా సంచలనం.! ఎవరీ Niharika NM?
ఫైనల్‌గా అందరం కలిసేది స్మశానంలోనే.. మధ్యలో జరిగేది అంతా డ్రామా.. అంటూ పూరి జగన్నాథ్ ముగించాడు.
సో, ప్రేక్షకుల్ని మోసం చేసినట్లు పూరి జగన్నాథ్ ఒప్పుకున్నాడన్నమాట. ఒప్పుకున్నట్టే ఒప్పుకుని.. తప్పు చేయలేదంటున్నాడు. దటీజ్ పూరి జగన్నాథ్.
పూరి చెప్పింది మీకేమైనా అర్థమయ్యిందా.? నిజానికి, ఇవి అందరూ ఎప్పుడో ఒకసారి తమ జీవితంలో విన్న మాటలే. ఇందులో పూరి కొత్తగా చెప్పిందేమీ లేదు.!