వదిలేస్తే ఇద్దరూ (Jacqueline Fernandez.. Nora Fatehi) జుట్టూ జిట్టూ పట్టుకుని నడి రోడ్డు మీద కొట్టుకునేలా వున్నారు.!
శ్రీలంక బ్యూటీ జాక్వెలైన్ ఫెర్నాండెజ్, మొరాకో మూలాలున్న కెనడియన్ బ్యూటీ నోరా ఫతేహీ (Nora Fatehi) గురించే ఇక్కడ చర్చ.!
మనీ లాండరింగ్ కేసులో సుకేష్ చంద్రశేఖర్ అరెస్టు కాగా, ఆయనకి బాలీవుడ్ బ్యూటీ జాక్వెలైన్ ఫెర్నాండెజ్ గర్ల్ ఫ్రెండ్ అనే ఆరోపణలున్నాయి.
Jacqueline Fernandez సుఖేష్ నుంచి కోట్లాది విలువైన బహుమతులు..
200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో జాక్వెలైన్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ కేసులో విచారణకు హాజరైంది కూడా. అయితే, న్యాయస్థానాన్ని ఆశ్రయించి, అరెస్టు నుంచి ఊరట పొందింది జాక్వెలైన్.
జాక్వెలైన్ – సుఖేష్ త్వరలో పెళ్ళి పీటలెక్కనున్నారన్న ప్రచారం జరుగుతున్న సమయంలోనే ఈ కుంభకోణం తెరపైకొచ్చింది.
సుఖేష్ చంద్రశేఖర్ ఖరీదైన బహుమతుల్ని జాక్వెలైన్‌కి ఇచ్చాడనీ, వీటి విలువ కోట్లలో వుంటుందనీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అభియోగాలు మోపింది.
నోరా ఫతేహీ పేరు ప్రస్తావించిన జాక్వెలైన్
ఈ కేసులో నోరా ఫతేహీ (Nora Fatehi) పేరుని ప్రస్తావించింది జాక్వెలైన్. దాంతో, నోరా ఫతేహీకి ఒళ్ళు మండింది. తన పేరుని అనవసరంగా వివాదాల్లోకి లాగిందని ఆరోపిస్తూ నోరాఫతేహీ పరువు నష్టం దావా వేసింది.

జాక్వెలైన్‌తోపాటుగా పలు మీడియా సంస్థల పేర్లనూ పరువు నష్టం దావాలో ప్రస్తావించింది నోరా ఫతేహీ.
సుఖేష్ చంద్రశేఖర్‌తో నోరా ఫతేహీకి కూడా సంబంధాలున్నాయని జాక్వెలైన్ ఆరోపించగా, సుఖేష్‌తో తనకు పరిచయం లేదనీ, సుఖేష్ భార్య లీనా మారియా పాల్‌తో పరిచయం వుందని నోరా ఫతేహీ అంటోంది.
Also Read: Pooja Hegde: పూజా.. సల్మాన్‌తో బ్యాండ్ బాజా.?
తనకు సుఖేష్ నుంచిగానీ, లీనా మారియా పాల్ నుంచిగానీ ఎలాంటి బహుమతులూ అందలేదన్నది నోరా వాదన.
ఇద్దరు విదేశీ నటీమణులు, భారతీయ సినిమాలతో పాపులారిటీ పొంది, భారతదేశంలోని చట్టాల్ని.. అందునా ఫెమా చట్టాల్ని ఉల్లంఘించారన్న ఆరోపణలు ఎదుర్కొంటుండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?
పైగా, బండారం బయటపడేసరికి.. ఆ ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇది కలికాలం.!