Table of Contents
Chepala Pulusu.. ఆత్రేయపురం పూతరేకులు.. హైద్రాబాదీ బిర్యానీ.. చెప్పుకుంటే తెలుగు నేలపై చవులూరించే వంటకాలు చాలానే వున్నాయ్.! ఒక్కో వంటకానిదీ ఒక్కో ప్రత్యేకత.!
జస్ట్ కొన్ని వాటి గురించే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తే.. అది సమంజసం కాదు కూడా.! అన్ని రుచుల గురించీ చెప్పుకోవాలంటే.. రోజులు, నెలలు, సంవత్సరాలు కూడా సరిపోవ్.!
అదేదో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అట.! సోషల్ మీడియాలో ఈ పేరు మార్మోగిపోతోంది. ఎప్పుడూ చేపల కూర తినని మొహాల్లా ఆ కక్కుర్తి ఏంటి.? అని చాలామందికి అనిపించింది.. దీని గురించి విన్నాక.!
కిరాక్ ఆర్పీ.. తెలుసు కదా, జబర్దస్త్ కమెడీయన్.! ఆ కిరాక్ ఆర్పీ పెట్టిన దుకాణం పేరు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పలుసు. అదేనండీ, ఓ కర్రీ పాయింట్.
Chepala Pulusu ఆర్పీ భలే తెలివైన వ్యాపారమే మొదలెట్టాడు.!
నిజానికి, మంచి ఆలోచనే ఇది. విదేశాల్లో ఎమ్మెస్ చదివిన కుర్రాళ్ళూ ఇప్పుడు భిన్నమైన ఆలోచనలతో వ్యాపారాలు చేస్తున్నారు.
కోళ్ళ పెంపకం, పశువుల్ని పెంచి పాల ఉత్పత్తి కేంద్రాలు నడపడం, వ్యవసాయం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయ్.
సో, గ్లామర్ ఫీల్డ్ నుంచి వచ్చిన ఆర్పీ, కర్రీ పాయింట్ పెట్టి, అందులో చేపల పులుసు అమ్మితే తప్పేం లేదు. కాకపోతే, ఆ పేరుతో.. మిగతా ప్రాంతాల్లోని వంటకాల్ని ఆర్పీ అవమానించాడన్నది ఓ వాదన.
ఆంధ్రా బిర్యానీ పేడలా.. అన్నాడొకడు.!
‘ఆంధ్రోళ్ళ బిర్యానీ పేడలా వుంటుంది’ అంటాడో తల తిక్క పొలిటీషియన్. అది అతని రాజకీయ అవసరం. ఆంధ్రా పులావ్ ఎప్పుడైనా తిని వుంటే, ఆయనగారికి అసలు సంగతి తెలిసేది.
ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం.. అక్కడి ప్రత్యేకతలుంటాయ్. రాయలసీమలో రాగి సంకటి, పొట్టేలు తలకాయ మాంసం ఎంత ఫేమస్సో తెలంగాణలోనివారికీ బాగా తెలుసు.
Also Read: అమెరికాలో ‘ఆ’ తెలుగు ఎన్నారైలెలా దిగజారిపోతున్నారంటే.!
అంతెందుకు, దోసకాయ్ చట్నీ కొన్ని చోట్ల ఫేమస్. కోనసీమలో వండే పనసకాయ కూర, నాన్ వెజ్ని మించి భోజనప్రియుల్ని ఆకర్షిస్తుంది. తెలంగాణ పల్లెల్లో వెస్, నాన్ వెజ్ వంటకాలు, పిండివంటలు.. అహో అద్భుతం.
ఇక, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కోసం జనం మరీ అంతలా ఎగబడ్డం కూడా ఓ వింత. ఎందుకంటే, ఆ నెల్లూరు వంటకాలు హైద్రాబాద్‌లో చాలా చోట్ల ఇంకా అద్భుతమైన రుచితో దొరుకుతాయ్.
కిరాక్ ఆర్పీ చేసుకున్న జనం, దానికి కొన్ని యూ ట్యూబ్ ఛానళ్ళు చేసిన అతి ప్రచారం వెరసి.. అదో పెద్ద రచ్చ అయి కూర్చుంది.
అతి కాదిది.. తలపొగరు.!
రద్దీ తట్టుకోలేక.. డిమాండ్‌కి సరిపడా చేపల పులుసు తయారు చేయలేక.. మూడు రోజులపాటు దుకాణం మూసేసి, నెల్లూరు చెక్కేశాడట ఆర్పీ.
వంట చేయడానికి మహిళలే కావాలి.. కట్టెల పొయ్యిమీదనే ఆ రుచి వస్తుంది.. అంటూ నెల్లూరులో వంటల పోటీ పెట్టి.. వంట టీచర్లను (మగాళ్ళయితే వంట మాస్టారు అంటాం కదా.!) ఆర్పీ ఎంపిక చేయబోతున్నాడట.
ఇదీ ‘అతి’ అంటే.! తన సెలబ్రిటీ స్టేటస్‌ని ఆర్పీ వాడేస్తున్న వైనం.. జస్ట్ బిజినెస్ ట్రిక్ అనుకుంటే ఓకే.! అంతకు మించి ఆలోచిస్తే మాత్రం.. దీన్ని తల పొగరు అనుకోవాల్సి వస్తుంది.!