Nabha Natesh.. సంచలనంలా తెలుగు తెరపైకి దూసుకొచ్చింది నభా నటేష్.! ఎలా వచ్చిందో, అలాగే వెనకబడిపోయింది. పెద్ద సినిమాల్లో చాన్సులు వచ్చాయ్.!
కానీ, అనూహ్యంగా ఆమె తెరపై కనిపించడం మానేసింది. ఇంతకీ, నభా నటేష్‌కి ఏమయ్యింది.? ప్చ్.. తాను 2022లో మానసికంగా, శారీరకంగా చలా ఇబ్బంది పడ్డానంటూ చెప్పుకొచ్చింది నభా నటేష్.
గాయం తియ్యనిది కాదు.!
నభా నటేష్ ఓ ప్రమాదంలో గాయపడిందట. ఆ గాయానికి సంబంధించిన ‘గురుతు’ని చూపిస్తూ, ఓ ఫొటో విడుదల చేసింది నభా నటేష్. దాంతోపాటుగా ఓ ఎమోషనల్ నోట్ కూడా.!

అంత పెద్ద ప్రమాదం జరిగిందా.? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఇస్మార్ట్ బ్యూటీ కదా.. ఐ యామ్ బ్యాక్.. అంటోంది.!
రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ సినిమాల్లో కనిపిస్తానని నభా నటేష్ ధీమా వ్యక్తం చేస్తోంది.
‘అదిగో’, ‘నన్ను దోచుకుందువటే’ తదితర సినిమాలతో తెలుగులోకి సంచలనంలా దూసుకొచ్చిన నభా నటేష్, ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మంచి కమర్షియల్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.
Also Read: Vijay Varasudu.. అన్నీ కలిపి కొట్టేశాడు.!
రవితేజ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నితిన్.. తదితర హీరోలతో సినిమాలు చేసింది నభా నటేష్. మంచి నటి.. ఆపై మంచి డాన్సర్. అన్నిటికీ మించి గ్లామర్‌తోనూ ఆకట్టుకుంది నభా నటేష్.