Pawan Kalyan Unstoppable నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ఆహా – అన్‌స్టాపబుల్’ టాక్ షో రెండో సీజన్లో హాటెస్ట్ ఎపిసోడ్ అతి త్వరలో స్ట్రీమింగ్ కాబోతోంది.
మోస్ట్ పవర్ ఫుల్ ఎపిసోడ్ అది. ఆ ఎపిసోడ్ ముఖ్య అతిథి ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో అన్‌స్టాపబుల్ టాక్ షో ‘పవర్’ ఎపిసోడ్ ఆల్రెడీ షూట్ అయిపోయింది. దాన్ని అలా దాచి పెట్టారు.. రైట్ టైమ్ చూసి స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
Pawan Kalyan Unstoppable టీజర్.. తుస్సుమంది.!
నో డౌట్.. టీజర్ తుస్సుమంది.! ‘నీ అభిమాని కానోడు ఎవ్వడూ లేడు..’ అని నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి చెప్పడం మాత్రం అభిమానుల్ని అలరిస్తోంది.
అంతకు మించి, ఈ టీజర్లో ప్రత్యేకతలేం లేవు. ‘హై’ మూమెంట్ అసలే లేదు.

విమర్శల తీవ్రత పెరిగింది కదా.? అని బాలయ్య ప్రశ్నిస్తే, పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ వేరే లెవల్.! ‘నేను పద్ధతిగా మాట్లాడతానండీ’ అంటూ పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్లో సెటైరికల్ కామెంట్ చేశారు.
అభిమానులు ఓట్లెయ్యలేదా.? అని బాలయ్య ప్రశ్నించడం, అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిలో నచ్చే గుణాలు, నచ్చని గుణాల గురించి వేసిన ప్రశ్నలు.. వీటికి పవన్ ఏం సమాధానం చెప్పాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
మూడు పెళ్ళిళ్ళ సంగతేంటో.!
పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ అంశం కూడా చర్చకు వచ్చిందంటూ ప్రచారం జరుగుతున్న దరిమిలా, దానిపై పవన్ ఏం సమాధానం చెప్పాడో ఏమో.!
Also Read: ఎన్టీయార్ కెరీర్‌తో ఆడుకుంటున్న కొరటాల శివ.?
టీజర్ కోసం పవన్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశారు. కానీ, టీజర్ మాత్రం నిరాశపరిచింది. వెంటనే ఇంకో హై ఓల్టేజ్ ప్రోమో విడుదల చేయకపోతే కష్టం.. పవన్ అభిమానులు హర్టవుతారు.!