INS Vagir.. జలాంతర్గామి.. సబ్మెరైన్.. ఎలా పిలిస్తేనేం.! నీటి అడుగున దాక్కుంటుంది.. శతృవుల భరతం పడుతుంది.!
భారత నౌకాదళం అమ్ములపొదిలోకి మరో సరికొత్త జలాంతర్గామి చేరింది. ఆ సరికొత్త జలాంతర్గామి పేరే ఐఎన్ఎస్ వగీర్.
వాస్తవానికి ఐఎన్ఎస్ వగీర్ 2020లోనే లాంఛనంగా ఆవిష్కరించబడింది. అప్పటినుంచి సముద్రంలో ఆయుధాలు, సోనార్లు సహా పలు రకాలైన పరీక్షల్ని నిర్వహించారు ఈ జలాంతర్గామి ద్వారా.
అన్ని పరీక్షలూ పూర్తి చేసుకుని, భారత నౌకాదళంలోకి చేరింది.. అన్ని అస్త్రశస్త్రాలతో.!
INS Vagir.. ఐదోది.. అత్యంత శక్తివంతమైనది..
మొత్తం ఆరు జలాంతర్గాముల్ని స్కార్పీన్ జలాంతర్గాముల్ని, భారతదేశం ‘కల్వరి క్లాస్’ పేరుతో నిర్మించింది. మొత్తం ఆరు జలాంతర్గాముల నిర్మాణం పూర్తయ్యింది.
వగీర్ చేరికతో మొత్తంగా ఐదు జలాంతర్గాములు ప్రస్తుతం అందుబాటులో వున్నాయి. ఆరోది కూడా ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైంది. సీ ట్రయల్స్ జరుగుతున్నాయి.

త్వరలో ఆ ఆరో జలాంతర్గామి కూడా భారత నౌకాదళంలో చేరనుంది.
అణు జలాంతర్గాములున్నాగానీ..
భారత నావికాదళంలో అణు జలాంతర్గాములు కూడా వున్నాయ్. అయినాగానీ, డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గాములకి ప్రత్యేకమైన స్థానం వుంది.
ఈ నేపథ్యంలో అటు అణు జలాంతర్గాముల్నీ, ఇటు డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గాముల్నీ భారత్ తయారు చేసుకుంటోంది.
Also Read: Vande Bharat Express: టిక్కెట్టు లేకపోతేనేం ట్రెండ్ సెట్ చేశాడంతే.!
నీటి అడుగున వుండి నిఘా పెట్టడంలోనూ, అవసరమైతే శతృవులపై మెరుపు దాడులు చేయడంలోనూ జలాంతర్గాములది అత్యంత కీలక పాత్ర.
జలాంతర్గాముల ద్వారా శక్తివంతమైన టార్పెడోలతో, క్షిపణులతో తక్కువ సమయంలోనే పెను విధ్వంసాన్ని శతృదేశాల యుద్ధ నౌకలు, పోర్టులకు కలగజేయవచ్చు.