Kajal Aggarwal.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఆచార్య’ సినిమా నుంచి కాజల్ అగర్వాల్‌ని తీసేసిన సంగతి తెలిసింది.
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని చవిచూసింది.
తొలుత త్రిష ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపికైంది. త్రిషని తీసేసి కాజల్ అగర్వాల్‌ని తీసుకొచ్చారు. ఓ పాట చిత్రీకరించారు.. చాలా సన్నివేశాలూ ఆమె మీద షూట్ చేశారు.
Kajal Aggarwal సినిమాలోంచి ఔట్..
కానీ, సినిమాలోంచి కాజల్ ఔట్ అయిపోయింది. కాజల్ వుంటే, కథకు అడ్డం.. అన్న ఆలోచనతో ఆమెను తీసేశామని దర్శకుడు కొరటాల శివ చెప్పాడు.
ఆ మాటకొస్తే.. అందాల చందమామ కాజల్ అగర్వాల్ కూడా ఎక్కడా ‘ఆచార్య’ నుంచి తనను తీసేయడంపై విమర్శలు చేయలేదు. ఆమెకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇచ్చేయడంతోనే, ఆమె సైలెంటయ్యిందట.

అన్నట్టు, చిరంజీవి (Megastar Chiranjeevi) సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో అయితే ‘మగదీర’, ‘నాయక్’ తదితర సినిమాల్లో నటించింది ఈ అందాల చందమామ. పవన్ కళ్యాణ్‌తోనూ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ (Sardar Gabbar Singh) సినిమాలో కాజల్ నటించింది.
అలా మెగా కాంపౌండ్‌తో కాజల్‌కి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి.
బాలయ్య సినిమా కోసం..
కాగా, నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా (NBK 108) కోసం కాజల్ అగర్వాల్ పేరు ప్రచారంలోకి వచ్చింది.
Also Read: జాక్వెలైన్, నోరా ఫతేహి.! ఇరువురు భామల కౌగిలిలో.!
ఈ సినిమాలో శ్రీలీల, బాలయ్య కుమార్తెగా నటించనున్న సంగతి తెలిసిందే. కాగా, కాజల్ గనుక కాకపోతే, ఈ సినిమా కోసం ‘వీర సింహా రెడ్డి’ ఫేం హనీ రోజ్ (Honey Rose) పేరుని పరిగణిస్తారట.
ఆల్మోస్ట్ కాజల్ అగర్వాల్ కన్ఫామ్ అయిపోయిందని అంటున్నారు గనుక, హనీ రోజ్ సంగతేంటో.! ఓ స్పెషల్ సాంగ్ అయినా బాలయ్య (Nandamuri Balakrishna) ఆమెతో చేయించేలానే వున్నాడు.